Monday, April 29, 2024

లాక్‌డౌన్: ఆపినందుకు పోలీస్ చేయి నరికేశారు.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

 

హర్యానా: పంజాబ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిపై కొంత మంది దుండగలు దాడి చేసి అతని చేయి నరికిన ఘటన పటియాలలోని కూరగాయల మార్కెట్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)ను అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను విధించింది. ఈ క్రమంలో దేశంలో పలుచోట్ల పోలీసులు, వైద్యులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్ లో లాక్‌డౌన్ నిబంధనలను పకడ్బందిగా అమలు చేస్తున్న పోలీసులపై కొంతమంది దుండగలు దాడికి పాల్పడ్డారు. పటియాల సమీపంలోని మార్కెట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఓ వాహనాన్ని అడ్డుకొని పాసులు చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో రెచ్చిపోయిన దండగలు వాహ‌నంతో రోడ్డుకు అడ్డుగా పెట్టిన బారికేడ్లను ఢీకొట్టి పోలీసులపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా కత్తితో ఏఎస్ఐ చేయిని న‌రికి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిని ఏఎస్ఐని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ దాడిలో మరో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఏఎస్ఐని చంఢీఘడ్ లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి స‌ర్జ‌రీ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

 

Nihang Sikhs Chop off Cops hand At Patiala Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News