Sunday, April 28, 2024

కాబోయేవాడితో నిహారిక!.. ఫోటో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగ‌నున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికకు ఈ సంవత్సరంలో పెళ్లి చేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. దాంతో నిహారిక పెళ్లిపై సోష‌ల్ మీడియాలో పలు వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. గుంటూరుకి చెందిన ఓ గవర్నమెంట్ అధికారి కొడుకుని నిహారిక పెళ్లి చేసుకోనుంద‌నే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా, నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో నిహారిక ఓ వ్య‌క్తిని హ‌గ్ చేసుకొని అతని ముఖం కనిపించకుండా క‌వ‌ర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో నిహారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇతనేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Niharika Shares her Fiance Photo on Social Media 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News