Monday, April 29, 2024

కేంద్ర గ్రాంట్లలో అన్యాయం: డికె సురేష్

- Advertisement -
- Advertisement -

కేంద్ర గ్రాంట్లలో తమకు అన్యాయం జరుగుతున్న కారణంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దేశం కోరాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ ఎంపి డికె సురేష్ చేసిన ప్రకటనను ఖండిస్తున్నాను. ఆర్థిక సంఘం ఆదేశాలను పాటించడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు. నెలకు ఇంత ఇవ్వాలని ఆర్థిక సంఘం చెబితే నేను అంతే ఇవ్వగలను. ఆర్థిక మంత్రిగా ఎవరి పట్ల పక్షపాతం లేదా వివక్ష చూపడం మాకు సాధ్యపడదు. ఆర్థిక సంఘం వద్ద కూర్చుని తమ డిమాండ్లను, సమస్యలను చెప్పుకుంటే అవసరమైన గ్రాంట్లు వారికి లభిస్తాయి. దక్షిణాది రాష్ట్రాలు అని వాటిని కలిపి చెప్పడానికి నేను ఇష్టపడను. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం శక్తివంతమైనవి. దక్షిణాది రాష్ట్రాలు అన్నింటిని ఒకే గాటన కట్టడం ప్రమాదకర పరిణామం. నేను కూడా దక్షిణ రాష్ట్రానికి చెందిన వ్యక్తినే. ఎవరైనా దక్షిణాది రాష్ట్రాలు అని అంటే వెంటనే అడ్డుపడతాను. ఆభివృద్ధి సూచిలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ప్రతిభను చూపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News