Friday, May 17, 2024

సంచార జాతులను ఆదుకోవాలి

- Advertisement -
- Advertisement -

mp santhoshkumar

 

హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో నిరుపేదలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వంతో పాటు స్పందిస్తున్న వారిని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ అభినందించారు. వలసకూలీలకు ప్రభుత్వం ఉచిత బియ్యం, నగదు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే మానవత్వంతో అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. వలసకూలీలు, సంచార జాతులు, నిరుపేదల ఆకలి కేకలు రాష్ట్రంలో వినిపించవద్దనే లక్షంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో మానవీయ దృక్పథంతో సంచార జాతుల ఆకలిని తీర్చిన టిఆర్‌ఎస్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్యను ట్విట్టర్ వేదికగా రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అభినందించారు. ఆయన చేసిన సేవ మరికొంత మందికి ఆదర్శం కావాలని చెప్పారు. వివరాల్లోకి వెళ్లితే ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ విజయవాడ మార్గంలో నకిరకల్ సమీపంలో నాలుగు కుటుంబాలకు చెందిన సంచార జాతుల వారు 20 మంది గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు.

ఈ జాతుల్లోని మహిళలు వ్యవసాయ కూలీలుగా, మగవారు గ్యాస్‌స్టౌ రిపేరర్లుగా పనిచేస్తుంటారు. అయితే లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి వారికి ఉపాధి కరువైంది. వ్యవసాయ పనుల్లోకి వారిని రానివ్వడంలేదు. అలాగే గ్రామాల్లో తిరిగి గ్యాస్‌స్టౌ రిపేర్లు చేసే అవకాశాలు లేవు ఫలితంగా గతకొద్దిరోజుల నుంచి ఉపవాసాలు ఉండే పరిస్థితి ఏర్పడింది. వారి దీన పరిస్థితి చూసి స్థానికులు కొర్రలు ఇవ్వగా వాటిని వండి రెండురోజులు కేవలం చిన్నపిల్లకు వడ్డించి పెద్దలు పస్తులతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య తక్షణం స్పందించి వారకి నెలరోజులకు సరిపడే నిత్యావసరవస్తువులు ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అనేక విధాలుగా సహకరించనున్నట్లు హామీ ఇచ్చారు. పస్తులతో ఉండవద్దని ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అయినా తనదృష్టికి తీసుకువస్తే ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపి సంతోష్‌కుమార్ శాసనసభ్యుడు లింగయ్యను అభినందించారు. సరుకులతోనే సమస్యలు పరిష్కారం కావని కరోనా కాలంలో వారికి సహకారం అందించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో హృదయాలను కదిలించే అనేక సంఘటనలు జరగుతుంటాయి వాటిని ఎప్పటికప్పుడు స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సిఎం కోరుకున్నట్లు రాష్ట్రంలో ఎవరెక్కడ ఆకలి కేకలు వినిపించకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్న వారందరని ఈ సందర్భంగా సంతోష్ అభినందించారు.

సిఎం కెసిఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారు
ప్రజాసంక్షేమం కోరుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా లాక్ డౌన్‌పై ముందస్తు అంచనావేసి సంపూర్ణ నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లాక్‌డౌన్ పొడిగింపు, సడలింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత విపత్కరపరిస్థితుల్లో లాక్‌డౌన్‌పై ఏదైనా మినహాయింపు ఇస్తే అది తప్పనిసరిగా ప్రాణాంతకంగా మారుతుందని ఆయన తెలిపారు. కోవిద్19(కరోనా) వ్యతిరేక పోరాటంలో ఏ ఒక్క సడలింపు అనుమతించేది లేదనే కెసిఆర్ నిర్ణయంలో ప్రజాక్షేమం ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటించడంతో పాటు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. నోరు తేరిస్తే కరోనా వ్యాపిస్తోందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ మృత్యుంజయ్ వేసిన కార్డున్‌ను ట్విట్టర్‌లో ఎంపి సంతోష్‌కుమార్ పోస్టు చేశారు.

 

Nomadic species should be supported
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News