Monday, April 29, 2024

దళారులకు పన్నీరు.. రైతులకు కన్నీరు…!

- Advertisement -
- Advertisement -

Onion prices in the market fell

బహిరంగ మార్కెట్లో ఉల్లి రూ. 11 మాత్రమే

ధరలు ఒక్కసారిగా పెరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించి వినియోగ దారులు కంట కన్నీరు తెప్పించినా ధరలు ఒక్కసారి పడిపోయి వాటిని పండించిన రైతులకు కన్నీరు తెప్పించినా అది కేవలం ఉల్లికి మాత్రమే సాధ్యం. రెండు సంవత్సరాల క్రితం ఉల్లిగడ్డలు కొనుగోలు చేయాలంటే మార్కెటల్లో క్యూలో నిలబడి,ఆధార్‌కార్డు చూపించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. అది కూడా కుటుంబానికి కేజి మాత్రమే ఇచ్చేవారు. ఉల్లి దిగుబడులు పూర్తి స్థాయిలో తగ్గిపోవడం. దాని ధర కిలో రూ.100 నుంచి 150 వరకు ఉండటంతో మార్కెటింగ్ శాఖ అధికారులు కిలో ఉల్లిగడ్డను సబ్సిడీ కింద రూ.70 వినియోగ దారులకు అందించేవారు అది మాత్ర గతం మాత్రమే..

హైదరాబాద్: ప్రస్తుతం భారీ ఎత్తున ఉల్లిగడ్డలు నగరానిక వచ్చి చేరుతుండంతో వాటి ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. మన రాష్ట్రంలో కొల్లాపూర్, తాండూరు,నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు,కర్నాటక,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లిగడ్డలు నగరంలోకి వచ్చి చేరుతున్నాయి. నగరానికి మహారాష్ట్ర, కర్నాటకు నుంచి రోజుకు 20 నుంచి 23 వేల బస్తాలు ఉల్లి దిగుమతి

రైతులకు కన్నీరు…!
అవుతున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల నంచి అంటే కర్నూల్,మహబూబ్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి 5 వేల బస్తాలు తరలి వస్తున్నాయి. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు,పొరుగున ఉన్న ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున మార్కెట్ ఉల్లి దిగుమతులు జరుగుతున్నాయి. సుమారు రెండు వారాల క్రింతం హొల్ సేల్ మార్కెట్లో క్వింటాల్ ఉల్లి ధర రూ.1500 నుంచి రూ.1800లకు పలికింది. అదే విధంగా సెకండ్ గ్రేడ్ ఉల్లి క్వింటాల్‌కు రూ.1000 నుంచి 1200కు పలికింది.కాని ప్రస్తుతం ప్రధాన మార్కెట్లయిన మలక్‌పేట, బేగంబజార్, బోయినపల్లి, తదితర వాటిల్లో క్వింటాల్ ధర రూ.1100 నుంచి 1300ల లోపే పలుకుతుండగా సెకండ్ గ్రేడ్ ఉత్పత్తులు రూ. 700 పలుకుతోంది. ఇవి మార్కెట్లకు చేరుకునే సరికి పాడైపోతుండటంతో వాటిని క్వింటాల్‌కు రూ.300 నుంచి 500లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే రిటైల మార్కెట్లో మాత్రం వీటినే కిలో రూ.15 నంచి 20కి విక్రయిస్తున్నారు. గతంలో మహారాష్ట్ర నుంచి ఆశించిన దానికి కంటే ఎక్కువ కావడంతో స్టాకును నిల్వ చేసుకున్న వారు ప్రస్తుతం పంట దిగుబడి పెరగడంతో ఇంకా వాటిని గోడౌన్లలో నిల్వ ఉంచుకుంటే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందన్న ఆందోళనతో ఆ ప్రాంత రైతులు వాటిని నగరంలోని మార్కెట్లకు తరలించి నష్టానికి అమ్ముకుంటున్నారు.

తగ్గిన ధరల ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదు….

ఉల్లి ధరలు ఎంత తగ్గినా వాటి ఫలితం మాత్రం వినియోగదారునికి తగ్గడం లేదు. దానికి కారణం రైతులు ఉల్లి గడ్డల అమ్మకాల్లో దళారులను ఆశ్రయించడమే అని అధికారులు చెబుతున్నారు.పెద్ద ఎత్తున దిగుడులు పెరగడంతో అనేక మంది ఉల్లి రైతులు మార్కెట్లో నేరుగా అమ్ముకోకుండా దళారులను నమ్ముతున్నారు. దాంతో వారు రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా నామ మాత్రపు ధరను చెల్లిస్తున్నారు. పండించిన పంటను స్టోరేజ్ చేసుకునే సదుపాయం లేక పోవడం,వాతావరణంలో మార్పులతో త్వరగా కుళ్ళి పోయే అవకాశం ఉండటం, మార్కెట్‌కు స్వయంగా వెళితే పెద్ద మొత్తంలో ట్రాన్స్‌పోర్టు ఖర్చులు అవుతాయనే ఉద్దేశ్యంతో వారు దళారులను ఆశ్రయిస్తున్నారు.

దాంతో దళారులు రైతులకు కనీస గిట్టుబాటు ధరను కూ-డా చెల్లిండం లేదు. ఈ విధంగా దళారులు ఇటు రైతుల నుంచి అటు వినియోగ దారులు నుంచి పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారు.ఉల్లి దిగుమతి చేసే రాష్ట్రాల్లో పంట దిగుబడి పెరగడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని, మరి కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.అంతే కాకుండా ఉల్లి పంటను సంవత్సరానికి రెండు సార్లు వేయడం, నేల తీరును బట్టి అవి ఎక్కువ కాలం నిల్వ ఉండక పోవడం, గోడౌన్ల సౌకర్యం లేక పోవడం వంటి తదితర కారణాలతో రైతులు వచ్చినకాడికి అమ్ముకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News