Monday, April 29, 2024

ఢిల్లీకి 70 టన్నుల ఆక్సిజన్ రైలు

- Advertisement -
- Advertisement -

Oxygen Express with 70 tonnes of oxygen to reach Delhi: Railways

 

న్యూఢిల్లీ : ప్రాణాధార వాయువైన 70 టన్నుల ఆక్సిజన్‌తో ఎక్స్‌ప్రెస్ రైలు రాయిగఢ్ జిందాల్ స్టీల్ వర్క్ నుంచి ఆదివారం రాత్రి బయలు దేరి సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటుందని రైల్వేబోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ చెప్పారు. అంగూల్, కళింగ్‌నగర్, రూర్కెలా, రాయిగఢ్ నుంచి నాలుగు ట్యాంకర్లతో మెడికల్ ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి రైల్వే ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న కారణంగా ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో దేశంలో వివిధ ప్రాంతాలకు లిక్విడ్ ఆక్సిజన్ ను ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా పంపడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు 150 టన్నుల ఆక్సిజన్‌ను పంపామని, ఈరోజు రాత్రికి మరో 150 టన్నుల ఆక్సిజన్‌ను పంపుతామని శర్మ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News