Monday, April 29, 2024

కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)తో పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా(62) కన్నుమూశారు. గరునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. పంజాబ్ లోని అమృత్‌సర్‌ కు చెందిన ఖల్సా కరోనా కారణంగానే మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి.

కాగా, పంజాబ్‌లోని ప్రఖ్యాత అమృత్‌సర్‌ దేవాలయంలో అత్యున్నత పదవిలో తన సేవలందించిన నిర్మల్‌ సింగ్‌ ఖల్సాకు భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మరోవైపు దేశంలో రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,027 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 62కు చేరుకుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తుంది. తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య 127కు చేరుకోగా, ఎపిలో 132కు చేరుకుంది.

Padma Shri Khalsa died due to Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News