Sunday, April 28, 2024

రసాయనశాస్త్రంలో ఇద్దరికి 2021 నోబెల్ బహుమతి

- Advertisement -
- Advertisement -

Nobel in Chemistry

స్టాక్‌హోం(స్వీడెన్): రసాయనశాస్త్రంలో ఇద్దరిని 2021 నోబెల్ బహుమతి వరించింది. ‘పరమాణు నిర్మాణం: ఆర్గానోకాటాలిసిస్’అనే కీలకమైన కొత్త ఉపకరణాన్ని అభివృద్ధి చేసినందుకుగాను జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, అమెరికాకు చెందిన డేవిడ్ విసి మెక్‌మిల్లన్‌లకు ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ బుధవారం ప్రకటించింది.

“వారు నిర్మించిన ఉపకరణం ఫార్మాస్యూటికల్ పరిశోధనలో గొప్ప ప్రభావాన్ని చూయిస్తుంది, రసాయనశాస్త్రంను మరింత పరిపుష్టం చేస్తుంది” అని నోబెల్ కమిటీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. బెంజమిన్ లిస్ట్, డేవిడ్ విసి మెక్‌మిల్లన్ ఇరువురు దాదాపు రూ. 8.5 కోట్ల బహుమతిని పంచుకోనున్నారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో మెక్‌మిల్లన్(53) ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక బెంజమిన్ లిస్ట్(53) జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిటూట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News