Thursday, May 9, 2024

త్వరలో పాక్‌లో సార్క్ సదస్సు : ఇమ్రాన్ ఆశాభావం

- Advertisement -
- Advertisement -

Pak PM Imran Khan hopes to host SAARC Summit

ఇస్లామాబాద్ : తమ దేశంలో నిర్వహించ వలసి ఉన్న సార్క్ సదస్సు విపరీత అలస్యం అయినప్పటికీ కృత్రిమ అడ్డంకులు తొలగితే త్వరలో నిర్వహించే అవకాశం ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆశాభావం వెలిబుచ్చారు. సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ ( సార్క్)ప్రధాన కార్యదర్శి ఎసలా రువాన్ వీరకూన్ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్న సమయంలో ఇమ్రాన్ సార్క్ సదస్సును ప్రస్తావించారు. 2014 లో ఖాట్మండులో సార్క్ సదస్సు జరగడం ఆఖరిసారి అయింది. అప్పటి నుంచి ముఖ్యంగా 2016 నుంచి దీని దైపాక్షిక సమావేశాలు జరగడం లేదు. 2016 నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్నును నిర్వహించడానికి నిర్ణయమైనా జమ్ముకశ్మీర్ లోని ఉరిలో అదే సంవత్సరం సెప్టెంబరులో భారత ఆర్మీపై ఉగ్రదాడి జరిగిన తరువాత భారత్‌తోపాటు బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్థాన్, సార్క్ సదస్సుకు హాజరు కాడానికి ముందుకు రాలేదు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News