Saturday, May 11, 2024

రఫేల్‌కు పోటీగా పాక్ జె-10సి యుద్ధ విమానాల కొనుగోలు

- Advertisement -
- Advertisement -

Pakistan buys 25 China-made J-10C fighter jets

ఇస్లామాబాద్: భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు సమాధానంగా పాకిస్తాన్ తన మిత్రదేశమైన చైనా నుంచి 25 బహుళ ప్రయోజనకర జె-10సి యుద్ధ విమానాలను కొనుగోలుచేసింది. పాక్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం రావల్పిండిలో విలేకరులతో మాట్లాడుతూ అన్ని వాతావరణాలను తట్టుకునే సామర్ధంగల 25 జె -10సి యుద్ధ విమానాలు వచ్చే ఏడాది మార్చిలో పాకిస్తాన్ దినోత్సవ పెరేడ్‌లో పాల్గొంటాయని చెప్పారు. మార్చి 23న జరిగే పాకిస్తాన్ దినోత్సవంలో మొట్టమొదటిసారి విఐపి అతిథులు హాజరవుతున్నారని, రఫేల్‌కు సమాధానంగా పాకిస్తాన్ వైమానిక దళం జె-10సి ఫైటర్ జెట్లతో విన్యాసాలు చేస్తుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News