Monday, April 29, 2024

తొలి వన్డేలో పాక్ గెలుపు

- Advertisement -
- Advertisement -

Pakistan win first ODI against Zimbabwe

 

రావల్పిండి: జింబాబ్వేతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య పాకిస్థాన్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు జింబాబ్వే అసాధారణ పోరాట పటిమను కనబరిచి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమాముల్ హక్ అర్ధ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న హక్ ఆరు ఫోర్లతో 58 పరుగులు సాధించాడు. మరోవైపు హారిస్ సోహైల్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రద స్కోరును అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న హారిస్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 71 పరుగులు చేశాడు.

చివర్లో ఇమాద్ వసీం 34 (నాటౌట్), ఫహీం అశ్రఫ్ (23) వేగంగా ఆడడంతో పాకిస్థాన్ భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 49.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ టైలర్ అద్భుత సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రెండన్ 11 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో వేగంగా 112 పరుగులు చేశాడు. వెస్లీ (55), క్రిగ్ ఎర్విన్ (41) తప్ప మిగతావారు విఫలం కావడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది ఐదు వికెట్లు పడగొట్టాడు. వహాబ్ రియాబ్ 4 వికెట్లు తీసి జట్టు విజయంలో తన పాత్రను పోషించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News