Thursday, May 9, 2024

సిఎం పాత్రలో పవన్

- Advertisement -
- Advertisement -

Pawan kalyan

 

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించి చేసుకుంటూ పోతున్నాడు. అయితే తాజాగా మరో సినిమాకు కమిట్ అయ్యాడట ఈ స్టార్ హీరో. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ఓ సినిమా చేయడానికి అతను ఓకే చెప్పాడని తెలిసింది. పూరీతో ఇదివరకే రెండు సినిమాలు చేసిన పవన్‌కు అతనితో ఇది మూడోది. రీ ఎంట్రీలో వరుసగా వేగంగా సినిమాలు చేస్తున్న పవన్ తాజాగా పూరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇక పూరి ఈ సినిమాలో పవన్ పాత్రను సిఎం అయ్యే కథనాయకుడిగా తీర్చిదిద్దాడట. అప్పట్లో మహేష్ బాబుతో ‘జనగణమన’ ప్రకటించిన పూరి ఆ సినిమాను పట్టాలెక్కించలేదు. ఇప్పుడు అదే కథను పవన్‌తో తీస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాపై అధికారికంగా ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

Pawan kalyan in the role of CM
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News