Monday, April 29, 2024

వైమానిక ప్రదర్శనకు వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: యెలహంకలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద గురువారం ‘ఏరో ఇండియా 2023’ అనే ఎయిర్ షోను ప్రజల కోసం తెరిచారు. ఎయిర్ షోను తిలకించడానికి వేలాది మంది అక్కడికి వచ్చారు. తమ సెల్‌ఫోన్లతో ఆకాశంలో రయ్ మంటూ దూసుకుపోయే విమాన దృశ్యాలను రికార్డు చేశారు. కొందరు శబ్దాన్ని తట్టుకోలేక చెవులు మూసుకున్నారు. చాలా కుటుంబాలు తమ వీకెండ్ ఆనందాన్ని రెట్టింపు అనుభవించాయి. కాగా కొందరు సందర్శకులు అక్కడి ఫుడ్ కోర్టుల్లో ఉన్న అత్యధిక ధరలపై ఫిర్యాదులు చేశారు. ఈ వైమానికి ప్రదర్శనలో రాఫెల్, జాగ్వర్ డరిన్, అపాచే ఏహెచ్64, ఎంబ్రేర్ సి390 మిల్లినియం వంటి విమానాలను ప్రదర్శించారు. కొందరు సందర్శకులు గేట్లకు నంబర్లు వేయలేదని ఆక్రోశాన్ని వెల్లగక్కారు. మరికొందరు గేట్ల వరకు రావడానికి ఆటోలను బుక్ చేసుకున్నారు.

ఈ ఎయిర్ షోలో ఏరియల్ డిస్‌ప్లే వ్యూయింగ్ ఏరియా(ఏడివిఏ) నుంచి చూసేందుకు రూ. 1000 టిక్కెట్ పెట్టారు. ఎగ్జిబిషన్ ఏరియా అండ్ ఏడివిఏ ఏరియా నుంచి చూసేందుకైతే రూ. 2500 టిక్కెట్ ధర పెట్టారు. పెద్ద ఎత్తున జనం రావడంతో ఈ టిక్కెట్ ధరలు పెట్టారని వినికిడి. తక్కువ ఆదాయం వారికి ఇది అందని ద్రాక్ష మాదిరిగానే ఉండింది.

air show

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News