Monday, April 29, 2024

ప్రై’వేటు’

- Advertisement -
- Advertisement -

Permission for private investments

 

కరోనా ప్యాకేజీ మాటున తెరలేచిన కీలక ఆర్థిక సంస్కరణలు
బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్‌మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్షం, అణు విద్యుత్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి
కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ, 50 బొగ్గు బ్లాకులు ప్రైవేటు
రక్షణ ఉత్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 74 శాతానికి పెంపు, మరి ఆరు విమానాశ్రయాలు పిపిపి పద్ధతిలోకి…
ఇస్రో సౌకర్యాలను ప్రైవేటు సంస్థలు వినియోగించుకోవడానికి వీలు, మైనింగ్‌లోనూ ప్రైవేటు

న్యూఢిల్లీ: బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, ఏరోస్పేస్ మేనేజ్‌మెంట్, విద్యుత్ పంపిణీ, అంతరిక్ష శోధన, అనుశక్తి రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు తలుపులు బార్ల తెరవాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్ వల్ల కుంగికునారిల్లిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ రూపొందించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్(స్వావలంబన భారత్)పథకం నాలుగోభాగాన్ని మంత్రి దేశ ప్ర జలకు వెల్లడించారు.

అందులో భాగంగా కీలక సం స్కరణలు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. బొగ్గు రంగంలో ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగించదలిచారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకుగాను ఈ చర్య తీసుకొంటున్నట్లు తెలిపారు. అదే విధంగా రక్షణ త్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పరిమితిని ఇప్పుడున్న 49శాతంనుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటుగా మరో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించనున్నట్లు తెలిపారు. బొగ్గు రంగంలో ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించా రు.

ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకా ల చర్యలను తీసుకొంటున్నట్లు తెలిపారు. టన్నుకు స్థిరమైన ధర కాకుండా ఇకపై రెవిన్యూ పంచుకునే విధానాన్ని తీసుకు వస్తున్నామన్నారు. సొంత అవసరాలు కలిగిన వినియోగదారులకు (క్యాప్టివ్ మైనింగ్)మాత్రమే ఇంతకు ముందు వేలంలో పాల్గొనేందుకు అను మతి ఉండేది. అయితే ఇప్పుడు ఆ నిబంధనలను తొలగిస్తున్నామని, ఇకపై ఎవరైనా వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. అలాగే బొగ్గును బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఇందకోసం 50 బ్లాక్‌లను తక్షణం కేటాయిస్తున్నామని తెలిపారు. బొగుగ తవ్వకాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.50 వేల కోట్లను కేటాయిస్తున్నామని, గడువుకన్నా ముందుగా లక్షాలను చేరుకున్న వారికి ప్రోత్సాహకాలు అందజేస్త్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.

ఖనిజ రంగంలోనూ..

గనుల రంగంలోను సరళీకృత వ్యాపార విధానాలను తీసుకు వస్తున్నట్లు మంత్రి తెలిపారు.500 మైనింగ్ బీఆ్లక్‌లను బహిరంగ, పారదర్శక వేలం ద్వారా కేటాయిస్తామని చెప్పారు.అల్యూమినియం పరిశ్రమలో పోటీ తత్వాన్ని పెంచేందుకు ఇకపై బొగ్గు,బాక్సైట్ బ్లాక్‌లకు సంయుక్తంగా వేలం నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల అల్యూమినియం పరిశ్రమలో విద్యుత్ చార్జీలు తగ్గుతాయని చెప్పారు.

సామాజిక మౌలిక సదుపాయాలు

ఆస్పత్రులు లాంటి సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ వాటాతక్కువగా ఉన్న దృష్టా ఈ అంతరాన్ని తగ్గించడానికి నిధులను 20 శాతంనుంచి 30 శాతానికి పెంచనున్నామని, ఇందుకోసం రూ.8,100 కోట్లు కేటాయించనున్నామని నిర్మలా పీతారామన్ చెప్పారు.

ఆటమిక్ ఎనర్జీ

క్యాన్సర్, ఆతర వ్యాధులకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించడానికి తోడ్పండేందుకు ప్రభుత్వప్రైవేటు భాగస్వామ్యం( పిపిపి) పద్ధతిలో ఒక రిసెర్చ్ రియాక్టర్‌ను ఏర్పాటు చేస్తారు అలాగే వ్యవసాయ సంస్కరణలకు తోడుగా ఆహార పదార్థాల నిల్వకోసి రేడియేషన్ లేని టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు వీలుగా పిపిపి పద్ధతిలో సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.

మరో ఆరు విమానాశ్రయాలు ప్రైవేటుకు..

ఇప్పటికే 12 విమానాశ్రయాలను పిపిపి విధానంలో ప్రైవేటుకు కేటాయించామని, మరో ఆరు ఎయిర్‌పోర్టులను కూడాప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి, నిర్వహణను ప్రవేటుకు అప్పగిస్తామని నిర్మాలా సీతారామన్ చెప్పారు. భారత ఎయిర్‌స్పేస్‌ను క్రమబద్ధీకరిస్తామని, దీనివల్ల ఏడాదికి సుమారుగా రూ.1000 కోట్లు విమానయాన రంగానికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. విమానాశ్రయాల అభివృద్ధికి గాను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ)కి రూ.2,300 కోట్లు కేటాయిస్తామని, మరో 13 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి రూ.13 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంల ప్రైవేటీకరణ

దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) మనుగడ సాగించేలా చర్యలు తీసుకొంటున్నామని,ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లింపులుజరిగేలా వాటిలో సంస్కరణలు తీసుకువస్తున్నామని ఆర్థికమంత్రి చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటీకరిస్తామని, నష్టాల ప్రభావం వినియోగదారులపై పడకుండా చూడడానికి చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు.

అంతరిక్షంలోను..

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు భాగస్వా మ్యం కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. ఉపగ్రహాల్లో ప్రైవేటుకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటుగా,అంతరిక్ష ఆధారిత సేవల్లో బాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. ప్రైవేటు కంపెనీలు తమ సామరర్థాన్ని పెంచెకునేందుకు ఇస్రో సౌకర్యాలు, ఇతర ఆస్తులను ఉపయోగించుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గ్రహాన్వేషణ, బాహ్య అంతరిక్ష ప్రయాణం వంటి భావి ప్రయోగాల్లో ప్రైవేటురంగానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.

రక్షణ తయారీలో ఎఫ్‌డిఐ పరిమితి పెంపు

భద్రతా సిబ్బందికి అధునాతన రక్షణ సామగ్రిని అందించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అదే సమయంలో ‘ మేక్ ఇన్ ఇండియా’ను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సంవత్సరాల వారీగా దిగుమతి నిషేధించే ఆయుధాల జాబితాను తయారు చేస్తాం. వాటి దిగుమతిని నిలిపి వేస్తాం. దిగుమతి చేసుకునే ఆయుధాల విడిభాగాలను దేశంలోనే తయారు చేస్తాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును కార్పొరేటైజ్ చేయడం ద్వారా రక్షణసరఫరాలో స్వయంప్రతిపత్తి, జవాబుదారీ తనం,సమర్థత పెరుగుతాయి.రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎఫ్‌డిఐ పరిమితిని ఆటోమేటిక్ రూట్‌లో 49 శాతంనుంచి 74 శాతానికి పెంచుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News