Monday, April 29, 2024

పుట్టుకతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేకి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్ డేట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎ ద్దేవా చేశారు. ఆ పార్టీ 40 సీట్లు కూడా సాధించలేదంటూ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ అ న్నారని చెబుతూ కాంగ్రెస్ కనీసం 40 సీట్లయినా గెలవాలని కోరుకుంటున్నానని వ్యంగ్యంగా అ న్నారు. ‘రానున్న లోక్ సభ ఎన్నికల్లో మాకు 400 సీట్లు వస్తాయని ఖర్గే అన్నారు. అది మాకు ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఆయన అంచనా కచ్చితం గా నిజమవుతుంది’ అని  ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని రాజ్యసభలో బుధవారం సుదీర్ఘంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. నెహ్రూ కాలం నుంచి ఆ పార్టీ ఎన్నో అవకతవకలకు పా ల్పడిందన్నారు. అంబేద్కర్ కు సైతం భారతర త్న ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేతలు అనుకోలేదనీ, కానీ తమ కుటుంబ సభ్యులకు మాత్రం ఇచ్చుకున్నారని విమర్శించారు.

చూస్తుండగానే కాంగ్రెస్ పతనమైపోయిందని చెబుతూ, ఆ పార్టీ పతనం తనకు ఆనందాన్ని ఇవ్వదన్నారు. వికసిత భారత్ కోసం మోదీ 3.0 అవసరమన్నారు. వచ్చే ఐదేళ్ల లో ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూడబోతున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందుతుందని, భారత్ ను ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తామని చె ప్పారు. ప్రజారవాణా వ్యవస్థ తీరు కూడా మారుతుందన్నారు.అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మోడీ విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రాత్రికి రాత్రే గద్దె దించిన ఘనత ఆ పార్టీదన్నారు.యుపిఏ హయాంలో ఆర్థిక వ్యవస్థ అడుగంటిందని, పత్రికాస్వేచ్ఛను కాలరాశారని అన్నారు. ఆ పార్టీ ఏలుబడిలోనే దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయని చెప్పారు. ఆదివాసీలు, దళితులు అంటే కాంగ్రెస్ కు గిట్టదన్నారు. పుట్టుకతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేకి అని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకించారని, ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రులకు రాసిన లేఖలే ఇందుకు నిదర్శనం అని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన నెహ్రు లేఖల్లోని కొన్ని భాగాలను చదివి వినిపించారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకి అని, వారికి రిజర్వేషన్లు ఇస్తే ఉద్యోగులలో నైపుణ్యం దెబ్బతింటుందని నెహ్రూ పేర్కొన్నారని చెప్పారు. ఈ లేఖ రికార్డుల్లో ఉందన్నారు. అంబేద్కర్ లేకపోతే రిజర్వేషన్లు దక్కేవి కావన్నారు. తమ ప్రభుత్వం ఓ ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసిందని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు అన్ని పదవుల్లోనూ ప్రాధాన్యమిచ్చామన్నారు. పదేళ్ల క్రితం 120 ఏకలవ్య స్కూళ్లు ఉంటే, ఆ సంఖ్య ఇప్పుడు 400కి పెరిగిందన్నారు. దేశంలో రెండు ట్రైబల్ సెంట్రల్ యూనివర్శిటీలు ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేర్చిందని మోదీ చెప్పారు.మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నామన్నారు. బానిసత్వపు గుర్తులను చెరిపేసే పనిలో ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మన భూభాగాలను శత్రువులకు అప్పగించిందని, సైనిక ఆధునికీకరణను సైతం నిలిపివేసిందని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ భద్రత గురించి పాఠాలు చెబుతోందని ఎద్దేవా చేశారు. దేశం అబివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అబివృద్ధి చెందుతాయని మోదీ అన్నారు. ‘

నా దేశం అంటే ఒక్క ఢిల్లీయే కాదు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్నీ నావే. ఓ రాష్ట్రంలో సంక్షోభం వస్తే దాని ప్రభావం దేశమంతటా ఉంటుంది’ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారంచేస్తోందనీ, బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్, హెచ్‌ఏఎల్, ఎయిర్ ఇండియాలను దెబ్బతీసిందెవరు? మీ హయాంలో ఎల్‌ఐసీ ఎక్కడుంది, ఇప్పుడెక్కడుంది?’ అని మోడీ ప్రశ్నించారు. పిఎస్‌యులపై మదుపరుల విశ్వాసం పెరిగిందని, ఈ పదేళ్లలో పిఎస్‌యుల విలువ 9.5 లక్షల కోట్లనుంచి 17 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనేది ఒక నినాదం కాదనీ, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని ప్రధాని చెప్పారు.

ఉత్తర, దక్షిణ విభజన రేఖలు విషాదకరం
దేశాన్ని ఉత్తరాది , దక్షిణాదిగా విభజించే తీరులో వ్యవహరించడం దారుణమని ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విభజనరేఖల తీరుతో దేశ భవిత కుంటుపడుతుందని, ఇకనైనా కాంగ్రెస్ పార్టీ, కర్నాటకలోని ఆ పార్టీ ప్రభుత్వం ఈ చెలగాటాల వైఖరిని వీడాలని, ఈ మేరకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. రాజ్యసభలో బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీపరంగా విభజనరేఖలను చిత్రీకరిస్తోంది. పైగా ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక ప్రభుత్వం నుంచి ఏకంగా పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారని ఇది ప్రజా ధనం దుర్వినియోగం ద్వారా చేస్తున్న దుష్ప్రచారం అవుతోందని విమర్శించారు. కర్నాటకకు కేంద్రం నిధుల వాటాలో , పలు పన్నుల పంపిణీలో అన్యాయం జరుగుతోందని చెపుతూ కర్నాటక కాంగ్రెస్ తరఫున సిఎం సిద్ధరామయ్య ఆధ్వరంలో ధర్నా నిర్వహించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. వారు డిమాండ్లను ప్రస్తావించవచ్చు.

అయితే వీరు ఎంచుకున్న ద్వేషపూరిత వైఖరి బాధాకరం , దేశానికి నష్టదాయకం అవుతుందని ప్రధాని తెలిపారు. ఈరోజున తాను నిర్థిష్ట విషయంలో తన బాధను ఈ సభావేదిక ద్వారా అందరితో పంచుకుంటున్నానని, కొందరు వాడుతున్న పదజాలం దేశాన్ని ముక్కలు చేసే స్థాయిలో ఉంటోంది. కేవలం రాజకీయ స్వార్థప్రయోజనాలకు, అధికారం దొడ్డిదారిన దక్కించుకునేందుకు పాల్పడుతున్న చేష్టలు అందరిని కలవరపరుస్తున్నాయని ప్రధాని చెప్పారు. ఎన్నికలు, రాజకీయాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం రాష్ట్రం ఈ విధంగా మాట్లాడటం ఇబ్బందికరం. ఇటువంటి భాషపదప్రయోగాలు అనుచితం అని పేర్కొన్న ప్రధాని కర్నాటక ప్రభుత్వం వెలువరించిన యాడ్స్‌లోని భాషను చూసి ఏమనుకోవాలి? అని ప్రశ్నించారు. దేశం ముందుకు వెళ్లుతోంది. రేపటి తరం సరైన భవితను ఎంచుకునేందుకు సాగుతోంది. దీనిని అడ్డుకునే రీతిలో ఇప్పుడు వ్యవహరించడం ఇబ్బందికరం అని స్పష్టం చేశారు. దేశంలోని ఒక ప్రాంతంలో తయారు అయిన వ్యాక్సిన్‌ను దేశంలోని ఇతర పార్టీలకు ఇవ్వడం ఎందుకని కొందరు చెపుతున్నారు ? ఇది ఎంతవరకూ సబబు అని మోడీ ప్రశ్నించారు. ఇటువంటి ఆలోచనలు ఏమిటీ? ఇటువంటి బాదాకరమైన భాషను ఏకంగా ఓ జాతీయ పార్టీ వాడటం నిజానికి విషాదకరం అవుతుందని తెలిపారు.

ఈ దేశం కేవలం భూ తునక కాదు అంతకు మించి ఎంతో ఉంది
భారత దేశం అంటే కేవలం కొన్ని ప్రాంతాల కలయికలతో కూడిన భూ భాగం అని అనుకోరాదు. ఇది భూతునక అనుకోవడం, దీనికి ప్రాంతీయ భేదాలు ఆపాదించడం బాధాకరం అవుతుందని మోడీ తెలిపారు. శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అది అంతటికి తెలుస్తుంది. మన పాదానికి ముల్లు గుచ్చుకుంటే తనకెందుకు లే అని మన చేయి అనుకోదు. దీనిని తొలిగించేందుకు సహజసిద్ధంగా , అసంకల్పితంగా చొరవ తీసుకుంటుందని చెప్పారు. ఇది మనకు కూడా వర్తిసుందని దేశంలో ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే ఇతర ప్రాంతాలు కూడా బాధపడుతాయి. అందరు కూడా దీనిని అనుభూతి చెందుతారు. ఏదైనా శరీరభాగం పనిచేయకపోతే మనను దివ్యాంగులుగా వ్యవహరిస్తారు. ఏ ప్రాంతం అయినా ప్రగతి లేకపోతే దేశం అంతా కూడా దెబ్బతింటుందని, ప్రగతికర దేశంగా ఎవరూ చూడరని తెలిపారు. దేశాన్ని ఒకే ప్రాంతంగా భావించాల్సి ఉంటుంది, తప్పితే వేర్వేరు భాగాలుగా పరిగణించరాదని,

ఈ భావనతో ముందుకు సాగడం చేటుకు దారితీస్తుందని విమర్శించారు. హిమాలయాలను ఉదాహరణ తీసుకోండి. ఈ పర్వతాల ప్రారంభ చోటున ఉద్భవించిన నదుల జలాలను ఇతర ప్రాంతాల వారు అనుభవించడం లేదా? అని ప్రశ్నించారు. విభజన ఆలోచనలు తలెత్తితే , ఇది ఇంతటితో ఆగిపోదు. బొగ్గు గనులు ఉన్న రాష్ట్రాల బొగ్గు ఇతర ప్రాంతాల వారు పంచుకోకూడదా? కాదంటే ఇక దేశం ఏ గతి నడుస్తుంది? అని ప్రశ్నించారు. తూర్పు రాష్ట్రాలు తమ వైపు నుంచి వీచే గాలిని ఇతర రాష్ట్రాలకు వెళ్లనివ్వమని చెపితే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. మా డబ్బు మా పన్నుల వాటా అని కొందరు అనుకోవడం ? ఏమిటిది అని కాంగ్రెస్‌కు చురకలు పెట్టారు. . ఈ దేశం అంతా ఒక్కటిగా భావించుకుని ముందుకు సాగండి. ప్రగతిపథంలో సమిష్టిత్వం తప్పితే సంకుచితం పనికిరాదని మోడీ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News