Monday, April 29, 2024

ప్రధానిది 50 ఏళ్ల విజన్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిటిఐకిచ్చిన ఇంటర్వూలో దేశం పట్ల ఆయన విజన్‌ను అధికార బిజెపి నేతలు ప్రశంసించగా, ఇండియా విపక్ష కూటమి నేతలు మాత్రం పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రశ్నలను లేవనెత్తాయి. ప్రధాని మోడీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్ల కాలంలో దేశం ఎంతో అభివృద్ధిని సాధించిందని, ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుదలకు జి20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం ఒక మైలురాయనే విషయంలో ఎవరికీ అనుమాననం లేదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కాగా దేశంలో అందుబాటులో ఉన్న యువత టాలెంట్‌ను ప్రధాని 140 కోట్ల ప్రజలతో కూడిన ఎదుగుతున్న దేశానికి అడ్వాంటేజిగాప్రధాని మార్చారని మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్న

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌నుంచి బిజెపిలోకి మారిన అనిల్ ఆంటోనీ స్పందిస్తూ స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 67 ఏళ్లలో జరిగిన దానికన్నా కూడా గత తొమ్మిదేళ్లలో ఎంతో ఎక్కువ జరిగిందని అన్నారు. అయితే ప్రతిపక్షాలకు చెందిన ఇండియా కూటమి నేతలు మాత్రం ప్రధాని వ్యాఖ్యలను తప్పుబడుతూ పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందేనని దుయ్యబట్టారు. రాబోయే జి20 సదస్సును దృష్టిలో ఉంచుకుని రోడ్లను అందంగా తీర్చిదిద్దుతున్నారని, అయితే భారతీయ యువత మాత్రం నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపి రంజీత్ రంజన్ అన్నారు. కుంభకోణాలు, ద్రవ్యోల్బణంపై ప్రభుత్వ సమాధానాలు చెప్పాలని ప్రజలు అడుగుతున్నారు’అని ఆమె అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో నిరుద్యోగం గత 42 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని, ఇంధనాలు, మందుల ధరలు భారీగా పెరిగాయని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కారణంప్నుల జీవితాలు క్లిష్టంగా మారాయని కాంగ్రెస్ నాయకురాలు శోభా ఓఝా అన్నారు. మహిళలు, దళితులు, ఆదివాసీలపై అకృత్యాలు పెరిగిపోయాయని కూడా ఆమె అన్నారు. తమ ప్రభుత్వం రాజకీయ స్థిరత్వాన్ని అందించిందన్న మోడీ వ్యాఖ్యలపై డిఎంకె నేత టికెఎస్ ఇలంగోవన్ స్పందిస్తూ దేశంలో ఇప్పుడు రాజకీయ సుస్థిరత, సమానత్వం లేవని అన్నారు. అయితే ప్రధాని మోడీ రాబోయే 25 50 ఏళ్ల కోసం ఒక విజన్‌తో పని చేస్తున్నారని బిజెపి నేతలు కొనియాడారు.‘2047లో స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి భారత్ ఒక అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ దేశంగా అవతరిస్తుంది’ అని బిజెపి ఎంపి సుబ్రత్ పాఠక్ అన్నారు. ప్రధాని మోడీ రిపోర్టు కార్డు బలంగా ఉందని, రాబోయే 40 50 ఏళ్లకు విజన్‌ను ఆవిష్కరించిందని మరో బిజెపి నేత జైవీర్ షెర్గిల్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News