Sunday, April 28, 2024

ఎందరో వీరుల త్యాగఫలం.. ఈ స్వాతంత్ర్యం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modis 74th Independence Day speech

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటపై 74 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ… దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో వీరుల త్యాగఫలం.. ఈ స్వాతంత్య్రం అని గుర్తుచేశారు. మనందరం కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్నాం. దేశంలోని చాలా ప్రాంతాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటాన్నాయి. కరోనా వారియర్స్ సేవలు మరవలేనివని కొనియాడారు. కరోనా పోరాటంలో మనం గెలుస్తామన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనాపై విజయం సాధించాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.  దేశభద్రతను కాపాడుతున్న సైనికులు, పోలీసులకు వందనం తెలిపారు. సైనికులు, పోలీసుల మనల్ని నిరంతరం రక్షిస్తున్నారు.

ప్రపంచంతో పాటు దేశం విపత్కర పరిస్థిల్లో పయనిస్తోంది. కరోనా వచ్చి ప్రపంచాన్ని పీడిస్తోంది. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారు. కరోనాతో పాటు దేశవ్యాప్తంగా వరదలు చుట్టుముట్టాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రపంచానికి ఒక దీపశిఖ. ఆత్మనిర్బర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సిద్ధం అయింది. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన రైతులు నిరూపించి చూపాలి. భారత్ తయారీ వస్తువులను ప్రపంచానికి ఉత్పత్తి చేయాలి. 75 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో అనేకం సాధించాం. మన శక్తిని ప్రపంచ అవసరాలకనుగుణంగా మలుచుకోవాలి. ఎఫ్ డీఐల్లో గతేడాది 18శాతం వృద్ధి సాధించాం.

కరోనా కష్టకాంలంలో కూడా మనం కొత్త దారులు వెతుక్కుందాం. ”వోకల్ పర్ లోకల్” అనే మాటను నిలబెట్టుకుందాం. మళ్లీ భారత్ వస్తువులకు పూర్వవైభవం తీసుకొద్దాం. ఇకపై వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. చైనా వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. దేశ రవాణా రంగం గతినే మార్చేసింది. ఉన ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహకం కల్పిద్దాం. ”మేకిన్ ఇండియా”తో పాటు.. మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకెళ్లాలి. కష్టకాలంలో ప్రతి ఇంటికి ఆహారధాన్యం చేరింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యమన్నారు మోదీ. కరోనా వ్యాక్సిన్ కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News