Monday, April 29, 2024

గంజాయిపై యుద్ధం

- Advertisement -
- Advertisement -

వరుసగా దాడులు చేస్తున్న పోలీసులు
పిడి యాక్ట్ పెడుతున్న నగర పోలీసులు
స్పెషల్ సెల్ ఏర్పాటు చేసిన సైబరాబాద్ పోలీసులు
సులభంగా డబ్బులు సంపాదించే మార్గం
ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు
Police attack on cannabis

మనతెలంగాణ, సిటిబ్యూరో: గంజాయి, డ్రగ్స్, గుట్కా విక్రయాలపై మూడు పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి వరుసగా దాడులు చేస్తూ గంజాయి, గుట్కా విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేసి గంజాయి విక్రయించే వారిని పట్టుకుంటున్నారు. నగరంలోని గంజాయి విక్రయించే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంగళ్‌హాట్, ధూల్‌పేట తదితర ప్రాంతాల్లో గంజాయి సప్లయర్స్ ఎక్కువగా ఉండడంతో వారిని వేటాడి పట్టుకుంటున్నారు. గంజాయి స్మగ్లర్లకు సహరిస్తున్న స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్, ఎస్సైని నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. గతంలో గంజాయి విక్రయించిన వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. గతానికి భిన్నంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గంజాయి, హాష్ ఆయిల్, గుట్కాల, డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.

దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా అయ్యే గంజాయి ముఖ్యంగా ధూల్‌పేట కేంద్రంగా కొనసాగుతోంది. దీనిపై దృష్టి సారించిన పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు విద్యార్థులు గంజాయికి బానిసగా మారి తర్వాత వారే విక్రయిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేస్తున్న చాలామంది గంజాయిని విక్రయిస్తున్నారు. ఇలా చాలామంది విద్యార్థులు విచ్చలవిడిగా గంజాయిని తీసుకుంటున్నారు. అంతేకాకుండా నగరంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి విక్రయిస్తున్నారు. నగర యువత మొత్తం గంజాయి మత్తులో తూగుతోంది. విద్యాకేంద్రాల వద్ద పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు. గంజాయి విక్రయించే వారే కాకుండా తీసుకుంటున్నవారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గంజాయి విక్రయించే వారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి విక్రయిస్తున్న వారిలో చాలామంది గతంలో గంజాయి విక్రయిస్తు పట్టుబడిన వారే ఎక్కువగా ఉంటున్నారు. రోజు పోలీసులు దాడులు చేస్తుండడంతో కిలోల కొద్ది గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.

పిడి యాక్ట్…

మూడు పోలీస్ కమిషనరేట్‌లో గంజాయి విక్రయిస్తున్న వారిపై పోలీసులు పిడి యాక్ట్ పెడుతూ ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో గంజాయి విక్రయించిన వారు పట్టుబడితే అరెస్టు చేసి జైలుకు పంపించేవారు. వారు జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ గంజాయి విక్రయిస్తున్నారు, దీంతో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఎపిలోని విశాఖపట్టనం, అరకు నుంచి ఎక్కువగా నగరానికి గంజాయి సరఫరా అవుతోంది. నగరానికి చెందిన పలువురు నిందితులు అక్కడి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. అక్కడ కిలో గంజాయికి రూ.2,000లకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ డిమాండ్‌ను బట్టి రూ.10,000 నుంచి రూ.15,000లకు విక్రయిస్తున్నారు. వ్యాపారం లాభసాటిగా ఉండడంతో చాలామంది గంజాయి విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే గంజాయి రవాణాకు అడ్డంకులు ఏర్పడడంతో హాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్నారు. దీనికి మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్ ఉండడంతో చాలామంది హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి విక్రయిస్తున్నారు.

రవాణాపై దృష్టిపెట్టిన పోలీసులు

గంజాయిన నగరంలోని విక్రయాలే కాకుండా సరఫరా రూట్లను పోలీసులు గుర్తిస్తున్నారు. నగరానికి ఎక్కువగా ఒడిసా, ఎపిలోని విశాఖపట్టనం, అరకు తదితర ప్రాంతాల నుంచి సరఫరా అవుతోంది. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా టీములను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేసేందుకు నగరాన్ని కేంద్రంగా వాడుకుంటున్నారు. హైదరాబాద్ మీదుగా ఆయా రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా అవుతుండడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పోలీసులను అప్రమత్తం చేశారు. నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో విస్కృతంగా తనిఖీలు చేస్తుండడంతో వందలాది కిలోల గంజాయి పట్టుకుంటున్నారు.

అవగాహన కార్యక్రమాలు…

గంజాయి, గుట్కా, డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై గురించి వివరించేందుకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. గంజాయికి అడ్డాగా మారిని ధూల్‌పేటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న స్థానికులకు కౌన్సెలింగ్, గంజాయి వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. గంజాయి విక్రయించవద్దని ప్రత్యామ్నాయ మార్గలను వెతుక్కోవాలని కోరారు. అలాగే డ్రగ్స్ ఫ్రీ సిటీ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేకంగా రన్ నిర్వహించారు. విద్యార్థులకు గంజాయి తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి వారికి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News