Monday, April 29, 2024

ఆపరేషన్ మర్కజ్

- Advertisement -
- Advertisement -

Operation Markaz

 

1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు

యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం

నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహణ
ఒక్క హైదరాబాద్‌లోనే మర్కజ్‌కు 603 మంది హాజరు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నిజాముద్దీన్ వెళ్లొచ్చిన 8 మంది యాత్రికులు మృతి
నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం జిల్లాల నుంచి పదుల సంఖ్యలో బాధితులు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రార్థనల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ ‘మర్కజ్ ’ ప్రారంభించారు. ఈనెల 16,17 తేదీలలో రాష్ట్రానికి చెందిన 1030 మంది ముస్లింలు మర్కజ్ ప్రార్థనలలో పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో వారి వివరాలు సేకరించే ప నిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మర్కజ్ ప్రాంతంలో మ తపరమైన ప్రార్థనలు చేసిన వారిలో చాలా మంది కరోనా బా రిన పడటం, ఆపై రాష్ట్రంలో ఇప్పటికే పలు పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరుగురు చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి వివరాలు సేకరించాలని పోలీసు శాఖలకు ఆదేశాలిచ్చి ంది. కాగా రాష్ట్రం నుంచి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన 1030 మంది యాత్రికులలలో దాదాపు 600మందిని ఇప్పటికే ఆ స్పత్రులకు తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో మర్కజ్‌లో పాల్గొన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. మా ర్చి 1 నుంచి ఢిల్లీ మర్కజ్ మసీదుల్లో మత సమావేశాలు జరిగాయి. మత సమావేశాలకు ఇరాన్, ఇండోనేషియా నుంచి బోధకులు వచ్చారు. 16,17 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు చెంది న ముస్లింలు పాల్గొన్నారు.

ఇరు రాష్ట్రాల నుంచి సుమారు 2వేల మంది పాల్గొన్నట్టు సమాచారం. సామూహిక ప్రయాణాలు, బస..అక్కడి నుంచే కరోనా విస్తరించింది. యుద్ధ ప్రాతిపదికన వీరందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. దగ్గు, జ్వరం లాంటి లక్షణాలున్న వారి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరు ఎవరెవరిని కలిశారనే అంశంపైనా దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో ఆరింటిలో ఆరు కేసుల్లో ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకోసం వెళ్లిన వారే కావ డం గమనార్హం. ఇప్పుడు ఇదే ఆందోళన కలిగించడానికి కారణం. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన తర్వాత వీరిలో చాలా మంది తమ తమ రోజూవారీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, బంధువులతో పాటు వందలాది మందిని కలిసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎంత మందికి కరోనా సోకింది? వారి ద్వారా అది ఎంత మందికి వ్యాపించింది అనేది కలవరానికి గురి చేస్తోంది.

విదేశాల వారితోనే కరోనా ముప్పు
మార్చి 13,-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించిన మర్క జ్ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా వారిలో విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యా రు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిర్గిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రార్థనల్లో ఎక్కువగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచీ భారీ సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియా బృందం ఈ ప్రార్థనల్లో పాల్గొన్న తర్వాతే రాష్ట్రానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

సమాచారం ఇవ్వాల్సిందే..!
మర్కజ్‌కు వెళ్లొచ్చిన ప్రతిఒక్కరూ విధిగా సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారుల లెక్కల ప్రకారం 29 జిల్లాల నుంచి 1030 మంది మర్కజ్ కు వెళ్లినట్లు తేలింది. వారందరినీ గుర్తించి వారితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహతంగా ఉన్న వారిని కూడా ఆసుపత్రులకు తరలించి పరీక్షిస్తున్నారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో అధికారుల లెక్కల ప్రకారం 29 జిల్లాల నుంచి 1030 మంది హాజరుకాగా వారిలో అత్యధికంగా రాజధాని పరిధి నుంచి 603 మంది వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

నిజామాబాద్ జిల్లా నుంచి 80 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 59మంది, వరంగల్ అర్బన్ నుంచి 38 మంది ప్రార్ధనలకు హాజరయ్యారు. అక్కడకు వెళ్లి వచ్చిన వారిలో కొందరికి పాజిటివ్ వచ్చినందున 1030 మందిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈక్రమంలో రాష్ట్ర పోలీసుశాఖ అప్రమత్తమై వెంటనే మర్కజ్ యాత్రికులను గుర్తించి వారితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారిని కూడా ఆసుపత్రులకు తరలించి పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ప్రతిఒక్కరూ విధిగా సమాచారం ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది.

హైదరాబాద్ జిహెచ్‌ఎంసి పరిధి నుంచి 603 మంది హాజరు కావడంతో రాచకొండ, నగర, సైబరాబాద్ సిపలు అప్రమత్తమైయ్యారు. మర్కజ్ యాత్రికులు ఆరుగురు మరణించడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే వారిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు తరలించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణ కు ప్రజలు సహకరించాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసిం ది.ఈ క్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని అధికారులు గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. రెవెన్యూ, జిహెచ్‌ఎంసి, పోలీస్ అధికారులు, డాక్టర్ల బృందంతో ట్రాకింగ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 8మంది మృతి
ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు కరోనా విస్తరించింది. ఢిల్లీ నుంచి వచ్చినవారిలో తెలుగురాష్ట్రాలకు చెందిన 8మంది మృతి చెందారు. మృతుల్లో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణ వాసులు ఐదుగురు ఉన్నారు. కాగా ఎపిలో మంగళవారం ఒక్క రోజే 17 కొత్త కేసులు నమోదు కాగా వారందరితో మర్కజ్ ప్రార్థనల లింక్ ఉన్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.

రాష్ట్రం నుంచి జిల్లాలవారీగా
మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాలు

ప్రాంతం                  సంఖ్య
హైదరాబాద్             603
అదిలాబాద్               30
కొత్తగూడం                11
జగిత్యాల                 25
జనగామ                 4
భూపాల్‌పల్లి               1
గద్వాల్                   5
కరీంనగర్                17
ఖమ్మం                  27
మహబూబాబాద్          6
మహబూబ్‌నగర్         11
మంచిర్యాల              10
మెదక్                    2
మేడ్చల్                  2
ములుగు                 2
నాగర్‌కర్నూల్            4
నల్గొండ                 45
నిర్మల్                   25
నిజామాబాద్             80
పెద్దపల్లి                   6
రాజన్న సిరిసిల్ల           9
రంగారెడ్డి                 13
సంగారెడ్డి                 22
సూర్యాపేట               10
వికారాబాద్               13
వనపర్తి                   3
వరంగల్ రూరల్          1
వరంగల్ అర్బన్          38
యాదాద్రి                  4

Police launched Operation Markaz
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News