Sunday, April 28, 2024

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్క నాటిన పూజా హెగ్డే

- Advertisement -
- Advertisement -

Pooja hegde plant tree in Green India challenge

మొక్కలు నాటండి – అందమైన ఈ భూమిని, సర్వజీవులను రక్షించాలని పిలుపునిస్తుంది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తుంది. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. చేయిపట్టి మొక్కలు నాటిస్తుంది.

ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో, టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్” ను తెలుగింటి బుట్టబొమ్మ పూజాహెగ్డే స్వీకరించారు. శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను పూజాహెగ్డే నాటారు. అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముక్ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసిరారు.

ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. “గ్రీన్ ఇండియా చాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుందని కొనియాడారు. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News