Saturday, April 27, 2024

వ్యాక్సిన్‌కు రూ.80 వేల కోట్లున్నాయా?

- Advertisement -
- Advertisement -

Poonawala questioned government about covid vaccine

 

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీరమ్ ఇన్‌సిట్యూట్ సిఇఓ పూనావాలా

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి అడ్డకట్ట వేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు ప్రపంచంలో లేదనే విష యం అందరికీ తెలిసింది. అలావటి వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ప్రయోగాలు జరుపుతున్నాయి. అ ప్రయోగాలు కొన్ని చివరి దశలో ఉండగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేయడం అనేది ఇప్పుడు చాలా పెద్ద సవాలని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా మారనుంది. దీన్ని ఉద్దేశించి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సిఇఓ అదర్ పూనావాలా ప్రభుత్వానికి ఒక ప్రశ్నను సంధించారు.

కొవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి పంపిణీ చేయడానికి వచ్చే ఏడాది కాలానికి ప్రభుత్వం రూ.80,000 కోట్లను ఖర్చు చేయగలదా? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. ‘క్విక్ కొశ్చన్: ఏచ్చే ఏడాది కాలానికి భారత ప్రభుత్వానికి 80,000 వేల కోట్ల రూపాయలు లభిస్తాయా? భారత దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందించాలంటే దాన్ని కొనుగోలు చేసి పంపిణీ చేయడానికి అవసరమైన మొత్తం ఇది. మనం పరిష్కరించాల్సిన తదుపరి సవాలు ఇది’ అని పూనావాలా ఆ ట్వీట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయాన్ని దానికి ట్యాగ్ చేశారు. ఒక వేళ వ్యాక్సిన్ రెడీ అయితే దాన్ని దేశంలోని అందరికీ అందించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇటీవలి స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం కోసం సీరమ్ సంస్థ ఇప్పటికే దిగ్గజ ఫార్మాసంస్థలు ఆస్ట్రాజెనెకా, నోవాగ్జిన్‌లతోఒప్పందాలు చేసుకున్న విష యం తెలిసిందే. ఆ రెండు వ్యాక్సిన్‌లు ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్నాయి. కాగా ఆస్ట్రాజెనెకా, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి వస్తే దాని ధర దాదాపు వెయ్యి రూపాయలు ఉండవచ్చని పూనావాలా గత జూలైలో ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. అంతేకాదు భారత్‌కు ఏడాదికి దాదాపు 30 మిలియన్ డోసుల వ్యాక్సిన్ లభించవచ్చని కూడా ఆయన చెప్పారు. అంటే ఈ లెక్కన దేశంలోని అందరికీ వ్యాక్సిన్ లభించాలంటే రెండేళ్ల సమయం పడుతుంది. అయితే ఇంతపెద్ద్దెత్తున జనానికి వ్యాక్సిన్‌ను అందజేయడానికి అవసరమైన అనుభవం కానీ, మౌలిక సదుపాయాలు కానీ భారత్‌కు లేవని బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో ఇదివరకే హెచ్చరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News