Monday, April 29, 2024

సైన్స్, దేవుడు అంశాల చుట్టూ…

- Advertisement -
- Advertisement -

Prabhas Nag Ashwin Combination all over interest

 

పాన్ ఇండియా స్టార్- ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని కాంబినేషన్ ఒక్కసారిగా తెరపైకి రావడంతో సినిమా ప్రకటన నాడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందని ఫిల్మ్‌మేకర్లు ప్రకటించడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా మూలకథ, జోనర్‌పై ఇప్పటికే పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అని.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో సోషల్ ఫాంటసీ అని పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ సైన్స్, దేవుడు అనే అంశాల చుట్టూ తిరుగుతుందట.

అలా అని ఇదో భక్తిరస చిత్రం కాదట. పైకి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా కనిపిస్తుంది కానీ అంతర్లీనంగా దేవుడికి సంబంధించిన అంశాలను చర్చిస్తారట. దీన్నో కొత్త జోనర్ సినిమా కింద పరిగణించాలని అంటున్నారు. నాగ్ అశ్విన్ తొలి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో కూడా సెకండ్ హాఫ్‌లో ఫిలాసఫీ టచ్ ఉంటుంది. ఇందులో హీరో ‘నేనెందుకు పరిగెడుతున్నాను. దేని వెనుక ఈ ఉరుకులు పరుగులు?’ అనే ఆలోచనతో తన మైండ్ సెట్ మార్చుకుని ‘శాంతి’ లభించినట్టుగా ఫీల్ అవుతాడు. పైకి చూస్తే వేదాంతం లాగా కనిపించకపోయినా అది వేదాంతానికి సంబంధించిన పాయింటే. మరి అలాగే ప్రభాస్ సినిమాలో దేవుడికి సంబంధించిన పాయింట్లను నాగ్ అశ్విన్ చర్చిస్తాడేమో వేచి చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News