Monday, April 29, 2024

నేపాల్ కమ్యూనిస్ట్ పార్లమెంటరీ నేతగా ప్రచండ

- Advertisement -
- Advertisement -

Prachanda as Communist Parliamentary Leader of Nepal

 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న ప్రచండ

కాఠ్మండ్: నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పుష్పకుమార్‌దహాల్(ప్రచండ)ను ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నారు. కాఠ్మండ్‌లోని పార్లమెంట్ భవనంలో బుధవారం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సీనియర్ నేత మాధవ్‌కుమార్ నేపాల్ ప్రచండ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించారు. రద్దయిన పార్లమెంట్‌ను పునరుద్ధరించి, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా ప్రచండ తెలిపారు. పార్టీ చైర్మన్ పదవి నుంచి కెపి శర్మఓలీని తొలగిస్తున్నట్టు మంగళవారమే కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ప్రకటించింది. పార్లమెంట్‌ను రద్దు చేయాలంటూ ఏకపక్షంగా సిఫారసు చేసినందుకు ఓలీపై క్రమశిక్షణా చర్యలు కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. పార్టీ చైర్మన్ పదవికి మాధవ్‌కుమార్‌ను ఎన్నుకున్నది. మరో పరిణామంలో పార్లమెంట్‌ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ వేసిన 12 పిటిషన్లపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి ఆ దేశ సుప్రీంకోర్టు బదిలీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News