Sunday, April 28, 2024

సాగుకే ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధిందిచన రుణాల పం పిణీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్దికి బ్యాంకర్లు తమ వంతు సహాకారం అందిచాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గు రువారం నిర్వహించిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు హజరయ్యా రు. 202425 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.2.80లక్షల కోట్లతో ఇటీవలే విడుదల చేసిన వార్షిక రుణ ప్రణాళికను సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సా మాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు.

వ్యవసాయం,హౌసింగ్,విద్య రంగాల రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పె ట్టుకోవడం సరైంది కాదన్నారు. రైతులకు రు ణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయాల ని సూచించారు. స్వయం సహాయక సంఘాల కు అధిక రుణాలు ఇవ్వాలన్నారు. రానున్న ఐ దు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాల మహిళల కు లక్ష కోట్ల రుణాలు ఇస్తామని , మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. వ్యవసాయరంగానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రుణాలు ఇచ్చే విషయం లో రైతుల పట్ల నిర్లక్ష్యం, అసహనం ప్రదర్శిస్తే ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారని, ఫ లితంగా ఇటువంటి పరిస్థితులు ఆత్మహత్యల కు దారితీస్తాయని హెచ్చరించారు. విద్య రుణా లు, కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభమై 20 ఏ ళ్లు అయినా ఆ రుణాల జారీలో ప్రగతి కనిపించడం లేదన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి సంపదను కింది వర్గాలకు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించండి సంపదను సృష్టించండి. రాష్ట్రంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలని సూచించారు.

పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతంగా పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్‌రోడ్ మధ్యన ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. వీటి మధ్యన పరిశ్రమల స్థాపన పెద్ద ఎత్తున ఉండబోతుందన్నాని పేర్కొన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో ప్రజలకు ప్రాధాన్యత ఉన్న పథకాలను గుర్తించి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. రుణాలు ఇచ్చే విషయం లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రం గాలకు బ్యాంకులు మొ దటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దేశ సంప ద రైతులని, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానం వ్యవసాయమన్నారు. దేశంలో వ్యవసాయం సంక్షోభంలోకి పోతే ఆహారం కొరత ఏర్పడే ముప్పు ఉందన్నారు. అందుకనే రైతులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో విచిన్నమైన వ్యవస్థలను సరి చేసి ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చాలని లక్ష్యం తో అంకితభావంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ఆ లక్ష్యాలను చేరుకునే విధంగా బ్యాంకర్ల పనితీరు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గట్టు గా పాల ఉత్పత్తి లేదని, పాడి పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకు వచ్చే రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. బ్యాంకింగ్ వ్యవ స్థ నిబద్ధతగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కావొద్దని హి తవు పలికారు. వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తే సమాజాన్ని విచ్ఛిన్నం చే సినట్టే అవుతుందన్నారు. ఆనంతరం పట్టు గూళ్ల పెంపకం రైతులకు 1, 83, 41,000 రూపాయల ప్రోత్సాహక ఇన్సెంటివ్ చెక్కు ను అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News