Monday, April 29, 2024

డిసెంబర్ 17న ‘పుష్పః ది రైజ్’

- Advertisement -
- Advertisement -

‘Pushpah The Rise’ release on December 17

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు రికార్డులను తిరగ రాశాయి. పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం ‘పుష్పః ది రైజ్’ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేశారు. డిసెంబర్ 17న మొదటి భాగం ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News