Monday, April 29, 2024

టైమ్స్‌స్కేర్ తెరపై రాహుల్ సందడి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్కేర్ వద్ద ఉండే తెరపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంబంధిత దృశ్యాలను చాలా సేపటివరకూ ప్రదర్శించారు. రాహుల్ న్యూయార్క్ పర్యటనకు ముందు ఈ బిల్‌బోర్డుపై భారత్ జోడో సన్నివేశాలు ప్రత్యక్షం అయ్యాయి. న్యూయార్క్ డౌన్‌టౌన్‌లోని కొన్ని వీధులలో కూడా స్క్రీన్లపై భారత్ జోడో యాత్ర దృశ్యాలను పదేపదే వెలువరించారు. ఇక్కడి భారతీయ సంతతికి చెందిన వారు ఈ భారత్‌జోడో యాత్ర క్లిప్పింగ్స్‌ను ఆసక్తితో చూశారు.

తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుని రాహుల్ గాంధీ పాల్గొనే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ భేటీకి దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. ఈ దశలోనే టైమ్స్‌స్కేర్‌లో రాహుల్ భారత్ జోడో యాత్ర క్లిప్పింగ్స్ ప్రసారం జరిగిందని వెల్లడైంది. టైమ్స్‌స్కేర్ వద్ద బిల్‌బోర్డుపై వచ్చే ఎటువంటి ప్రసారాలకు అయిన యాడ్ రూపంలో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. సమయం, చూపే నిడివిని బట్టి బిల్లులు ఖరారు చేస్తారు. రోజుకు ఈ ప్రసారం రేటు 5వేల డాలర్లు నుంచి 50 వేల డాలర్ల వరకూ ఉంటుంది. భారతీయ కరెన్సీలో చూస్తే దీని విలువ రోజుకు రూ 4 నుంచి రూ 41 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే టైం బట్టి రేట్లు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News