Saturday, April 27, 2024

ఎంత నవ్వులుంటాయో అంతే ఎమోషన్స్

- Advertisement -
- Advertisement -

Raja Raja Chora pre release event

శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న సినిమా విడుదలవుతుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి, నారా రోహిత్, బాబి, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ్, పవన్ సాధినేని, తేజ మార్ని, బెక్కెం వేణుగోపాల్, బెజవాడ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ “శ్రీవిష్ణు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

‘రాజరాజ చోర’ తన కెరీర్‌లో బెస్ట్ ఫిలిం కావాలని కోరుకుంటున్నాను”అని చెప్పారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ “ఈ సినిమాలో కథ చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది. సినిమాలో ఎంత నవ్వులుంటాయో అంతే ఎమోషన్స్ ఉంటాయి. వంద శాతం ప్రయోగాత్మక చిత్రమిది”అని అన్నారు. చిత్ర దర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ “ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కనిపించిన కొంటె విష్ణు కన్నా పది రెట్లు ఎక్కువగా ఇందులో కనిపిస్తాడు. విష్ణు, మేఘ, సునైన చక్కగా నటించారు. ఈనెల 19న ఈ సినిమా విడుదలవుతుంది”అని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News