Monday, April 29, 2024

పోలీస్ కథలంటే ఇష్టం: రామ్ చరణ్

- Advertisement -
- Advertisement -

నాకు పోలీస్ కథలంటే ఇష్టం.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నా
సైబరాబాద్‌లో యాన్యువల్ స్పోర్ట్ అండ్ గేమ్స్ ముగింపు వేడుకలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీనటుడు రామ్‌చరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోచ్ నాగపురి రమేష్

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరుగుతున్న స్పోర్ట్ అండ్ గేమ్స్ యానివర్సరీ ముగింపు వేడుకలు మంగళవారం జరిగాయి. ముఖ్యఅతిథులుగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత,కోచ్ నాగపురి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీనటుడు రామ్‌చరణ్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడల్లో పాల్గొనడం ముఖ్యమని అన్నారు. ఇంతకు ముందు ధృవ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా చేశానని, ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డానని తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ మీద ఉన్న గౌరవంతో ఎక్కడా చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. కోవిడ్ సమయంలో పోలీసుల సేవలు అద్భుతమని, అందరూ ఇళ్లల్లో ఉంటే పోలీసులు మాత్రం ఇరవై నాలుగు గంటలు రోడ్ల మీద ఉన్నారని అన్నారు. పోలీసు క్రీడలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నట్లు అన్నారు.

ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ మాట్లాడుతూ పోలీస్, యూత్ భాగస్వామ్యం చాలా అద్భుతమని అన్నారు. క్రీడాకారులను ముందుగా గుర్తించేది పోలీసులేనని అన్నారు. చాలామంది పోలీసులు తనకు ఫోన్ చేస్తారని, తమ ప్రాంతాల్లో బాగా ఆడుతున్న పిల్లల గురించి చెబుతారని అన్నారు. తెలంగాణ అమలు అవుతున్న ఫ్రెండ్లీ పోలీస్ అంటే తనకు బాగా ఇష్టమని, ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిర్భయంగా మాట్లాడవచ్చని అన్నారు. పోలీసులు సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారని అన్నారు. షీటీమ్స్ ఏర్పాటుతో మహిళలు,యువతులు, బాలికలపై వేధింపులు ఆగిపోయాయని, స్పోర్ట్‌లో కూడా యువతులు, బాలికలపై వేధింపులు తగ్గాయని తెలిపారు.

Ram Charan at Closing Ceremony of Annual Sports & Games

కరోనా సమయంలో పోలీసులు ప్రజల ప్రాణాల కోసం కష్టపడి పనిచేశారని అన్నారు. తమ ప్రాణాలను కాపాడుకుంటూనే, ప్రజల ప్రాణాలను కాపాడారని అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ నాలుగు రోజుల నుంచి జరుగుతున్న క్రీడలో దాదాపు 500మంది పోలీసులు పాల్గొన్నారని అన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడానికి వచ్చిన సినీనటుడు రామ్‌చరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీ నాగపురి రమేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్‌చరణ్ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెడుతున్నట్లు తెలిపారు. ప్లాస్మా దానం ద్వారా 8,000మంది ప్రాణాలు కాపాడగలిగామని అన్నారు. ఏడు టీములు నాలుగు రోజుల నుంచి పలు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో డిసిపిలు, ఎడిసిపిలు, ఎసిసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Ram Charan at Closing Ceremony of Annual Sports & Games

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News