Monday, April 29, 2024

జాన్సన్ టీకాతో అరుదైన సమస్య

- Advertisement -
- Advertisement -

Rare problem with Johnson vaccine

వాషింగ్టన్: ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన సింగిల్ డోసు కరోనా టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా నరాలపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. ఈ టీకా వినియోగ అనుమతుల పత్రంలో ఈమేరకు హెచ్చరికను జోడిస్తున్నామని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డిఎ) ప్రకటించింది. ఈ దుష్ప్రభావాన్ని గిలియన్ బారే సిండ్రోమ్‌గా పేర్కొంటారని నిపుణులు తెలిపారు. ఇప్పటివరకు అమెరికాలో 12.8 మిలియన్ మందికి జాన్సన్ టీకా ఇవ్వగా, వంద కేసుల్లో ఈ దుష్ప్రభావం కనిపించింది.

వీరిలో 95 శాతం మంది ఆస్పత్రి పాలవ్వగా ఒకరు మరణించారు. ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో టీకా తీసుకున్న 42 రోజుల్లో ఈ దుష్ఫ్రభావం కనిపించినట్టు తెలిసింది. సాధారణంగా ఏటా సీజనల్ ప్లూ, పుండ్లకు సంబంధించిన టీకాలు తీసుకున్న వారిలో 3000-5000 మందిలో గిలియన్ బారే సిండ్రోమ్‌ను గుర్తిస్తుంటామని, వీరిలో చాలా మంది కోలుకుంటారని ఎఫ్‌డిఎ పేర్కొంది. దీనివల్ల కండరాల్లో బలహీనత ప్రారంభమై పక్షవాతం వరకు దారి తీసే ప్రమాదం ఉందని వివరించింది. అయినప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్ సహా ఇతర కరోనా టీకాలను తీసుకోవడం మానవద్దని అమెరికా సీడిసీ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News