Monday, April 29, 2024

ఆర్‌బిఐ సమీక్ష ముఖ్యాంశాలు

- Advertisement -
- Advertisement -

RBI Review Highlights

 

పాలసీ రెపో రేటు 4 శాతం వద్ద యథాతథం. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు లేదా బ్యాంకు రేటు కూడా 4.25 శాతాన్నే కొనసాగిస్తూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని లక్షం పరిధిలో ఉంచేందుకు గాను సర్దుబాటు ఉపసంహరణపై ఆర్‌బిఐ దృష్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202223) జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనాను 7.8 శాతం నుంచి 7.2 శాతానికి కోత విధించారు. బ్యారెల్ 100 డాలర్ల వద్ద క్రూడ్ ఆయిల్ ఉండడంతో వృద్ధి అంచనాల్లో సవరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202223) ద్రవ్యోల్బణం అంచనా 4.5 శాతం నుంచి 5.7 శాతానికి పెంపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఆర్థిక దృక్పథంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

వేగవంతమైన రబీ ఉత్పత్తి గ్రామీణ డిమాండ్‌లో కోలుకునేందుకు దోహదం చేస్తుంది. వ్యాపార విశ్వాసం మెరుగవ్వడం, బ్యాంకు రుణాల్లో వృద్ధి, ప్రభుత్వ మూలధనం వ్యయాల్లో మెరుగుదలతో పెట్టుబడి కార్యకలాపాలు పెరిగాయి. ఆర్‌బిఐ రెగ్యులేటెడ్ ఫైనాన్షియల్ మార్కెట్లకు ప్రారంభ సమయం ఏప్రిల్ 18 నుంచి మారనుంది. కరోనా మహమ్మారి ముందు నాటి ఉదయం 9 గంటలకు పునరుద్ధరించనున్నట్టు ఆర్‌బిఐ తెలిపింది.

ఆర్‌బిఐ క్రమంగా వ్యవస్థలో అనేక సంవత్సరాల రూ.8.5 లక్షల కోట్ల అధిక లిక్విడిటీ ఉపసంహరణను చేయనుంది. హేతుబద్ధీకరించిన గృహ రుణ నిబంధనలు 2023 మార్చి 31 వరకు పొడిగింపు వాతావరణ ముప్పు, స్థిరమైన ఆర్థిక విధానంపై ఆర్‌బిఐ చర్చా పత్రాలతో రానుంది. ఆర్‌బిఐ రెగ్యులేటెడ్ సంస్థల్లో వినియోగదారుల సేవల ప్రమాణాల సమీక్షకు కమిటీ ఏర్పాటు యూపిఐని వినియోగించి అన్ని బ్యాంకులు, ఎటిఎంల నెట్‌వర్క్‌లలో కార్డు రహిత నగదు ఉపసంహరణ సౌకర్యం పొడిగింపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News