Sunday, April 28, 2024

ఆర్‌బిఎల్ బ్యాంక్ చీఫ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

RBL Bank chief resigns

బోర్డులోకి సభ్యుడిగా ఆర్‌బిఐ అధికారి

న్యూఢిల్లీ : ఆర్‌బిఎల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ విశ్వవీర్ అహుజా తన పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో తాత్కాలిక చీఫ్‌గా రాజీవ్ అహుజాను బ్యాంక్ నియమించింది. అలాగే ఈ సంస్థకు చెందిన చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ కె.దయాల్‌ను ఆర్‌బిఎల్ బ్యాంక్ బోర్డు అదనపు డైరెక్టర్‌గా రిజర్వు బ్యాంక్ నియమించింది. విశ్వవీర్ రాజీనామాను బోర్డు అంగీకరించిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆర్‌బిఎల్ బ్యాంక్ పేర్కొంది. డిసెంబర్ 25న ఆర్‌బిఎల్ బ్యాంక్ బోర్డు సభ్యులు సమావేశమై తాత్కాలిక ఎండి, సిఇఒగా రాజీవ్ అహుజా నియమించి, ఈ నియామకం తక్షణమే అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News