Monday, April 29, 2024

ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉండవు: ఆర్ కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

Reservation cancelled with Privatization

 హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేస్తే బిసి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని  బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకింగ్ ,ఎల్ ఐ సి,అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ నిరసిస్తూ ఈనెల 23న హైదరాబాద్ లోని సెంట్రల్ కోర్ట్ హోటల్ లో బిసి ఉద్యోగుల సమావేశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిసి జనగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.  ప్రైవేటీకరణతో బిసి ,ఎస్సి ,ఎస్టిలకు రిజర్వేషన్లు పోతాయని, బంగారు బాతు మన రైల్వే సంస్థ దాన్ని కూడా ప్రైవేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్ ఐ సి ఎంతో మంది పేదలకు ఉపయోగపడుతుందని, ఒడిఎఫ్ తో పాటు హెచ్ ఎ ఎల్ వంటి ఎన్నో ప్రముఖ ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం ను ప్రైవేట్ చేసి ఉద్యోగుల ను కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్యాంకుల కూడా ఎక్కడ నష్టం లేదని,అయిన బ్యాంక్ లను అమ్ముతున్నారని,  వెంటనే బిసిల కుల గణన చేయాలని, బిసి కుల గణన ఒక్కటే కాదు అన్ని కులాల గణన చేయాలని డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వం ఎందుకు బిసి కులాలకు అన్యాయం చేస్తోందని ప్రశ్నించారు.  ఒక్క బిసి మంత్రిత్వ శాఖ పెట్టలేని కేంద్ర ప్రభుత్వం 70 లక్షలు ఉన్న బిసిలకు ఎం న్యాయం చేస్తుందని నిలదీశారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు బిసి కుల గణన కోసం అసెంబ్లీ తీర్మానం చేశాయని, ఇంకా చేయడానికి కూడా ముందుకు వస్తున్నాయన్నారు.

అసెంబ్లీలో సిఎం కెసిఆర్ బిసి కుల గణన కోసం తీర్మానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.  కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా బిసి కుల గణన కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసమే బిసిలు కావాలని, బిసిలకు కూడా బిసి బంధు పెడుతానని కెసిఆర్ చెప్పారన్నారు. గతంలో కూడా కల్యాణ లక్ష్మీ పెడుతానని పెట్టారని, గురుకుల పాఠశాలు కూడా పెడుతానని చెప్పి మరి పెట్టారన్నారు.  బిసి బంధు పథకం పెడుతా అని ప్రకటించిన సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ నెల 23న జరిగే సమావేశాని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల బిసి ఉద్యోగులు రావాలి అని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News