Sunday, April 28, 2024

పరీక్షల సమయంలో ప్రశాంత నిద్ర అవసరం

- Advertisement -
- Advertisement -

పరీక్షలొస్తే చాలా మంది విద్యార్థులు రాత్రంతా చదివామని, బాగా పరీక్షలు రాయగలుగుతామని గొప్పలు చెప్పుకొంటుంటారు. ఎనిమిదవ తరగతి నుంచి డిగ్రీ పూర్తయ్యేవరకు పరీక్షలతో తీవ్రమైన ఒత్తిడి భరిస్తుంటారు. కొంతమంది విద్యార్థులు విపరీతమైన ఒత్తిడిపాలై అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుండగా, మరికొందరు ఆరోగ్యంగా ఉండి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి తమ కెరీర్‌కు బాట వేసుకుంటారు. ఇటువంటి సమర్థను సాధించడానికి విద్యార్థికి ఏది సహాయ పడుతుంది ? దీనికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి నిద్ర.

చాలామంది ఆరోగ్యానికి ప్రధాన కారణాల్లో నిద్ర ఒకటని గమనించడం లేదు. వాస్తవానికి ప్రాధాన్యమైన జాబితాలో దీని గురించి అసలు పట్టించుకోక పోవడమే ఎక్కువగా కనిపిస్తోంది. పరీక్షల సమయాల్లో చాలా మంది విద్యార్థులు నిద్రపోవడం లేదని తమకు తామే గొప్పగా చెప్పుకొంటుంటారు. అలా చదివితేనే పరీక్షల్లో బాగా రాయగలుగుతామని అలా చేయకుంటే పరీక్షలు బాగా రాయలేమన్న నమ్మకం చాలామందిలో ఉంటోంది. ఆఖరి నిమిషంలో చదివినదే పరీక్షలో గుర్తుంటాదని అనుకుంటారు. ఈ నమ్మకాలు ఎలా ఉన్నా రాత్రి బాగా నిద్రపోతేనే పరీక్షల్లో సమర్థంగా రాయగలుగుతారన్నది వాస్తవం.

అది పరీక్షకు ఒక రోజు ముందు సరిపోదు. నెలరోజుల ముందుగానే జరగాలి. నిద్రపోయే సమయం వ్యక్తిగతంగా వయసును బట్టి ఉంటుంది. పిల్లల నుంచి యువకుల వరకు చాలా నిద్రపోవడం అవసరం. సరాసరిన ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు నిద్రపోవడం చాలా మంచిది. దీనివల్ల శరీరం సరైన రీతిలో పనిచేస్తుంది. మంచి నిద్ర శరీరం లోని హార్మోన్లను స్థిరపరుస్తుంది. బ్లడ్‌సుగర్ , ఇన్సులిన్ , కొలెస్టరల్ , లెప్టిన్, ఘ్రెలిన్, కార్టిసల్ స్థాయిలను సమతూకంగా ఉంచుతుంది. శరీరం సరిగా పనిచేయాలంటే ఈ హార్మోన్లు చాలా అవసరం. నిద్రలేమి లెప్టిన్‌ను అణచివేస్తుంది లేదా సెటైటీ (తృప్తి) హార్మోన్ కలిగిస్తుంది. లేదా ఘ్రెలిన్ (ఆకలి) హార్మోన్‌ను ఉత్తేజ పరుస్తుంది.

ఫలితంగా వ్యక్తి అత్యధిక ఆకలికి , కోరికలకు (క్రేవింగ్స్) గురవుతుంటాడు. ఎక్కువ తియ్యనైన, ఉప్పు కలిగిన ఆహారాన్ని కోరుకుంటాడు. ఇది శరీరం బరువెక్కడానికి దారి తీస్తుంది. బ్లడ్‌సుగర్ స్థాయిలు సరిగ్గా నిర్వహించుకోకుంటే ఇన్సులిన్ స్థాయిలు పెరిగిపోతాయి. చిన్నవయసు లోనే డయాబెటిస్ సంక్రమించడానికి వీలు కలుగుతుంది. అలాగే నిద్రలేమి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. తరచుగా ఇన్‌ఫెక్షన్లకు శరీరం బలయ్యేలా చేస్తుంది. ఇమ్యునిటీ క్షీణిస్తుంది. అనారోగ్య స్థితిలో పరీక్షలు రాయవలసి వస్తుంది.

కార్టిసాల్ స్థాయిలు పెరగడం జ్ఞానంతోపాటు జ్ఞాపక శక్తి తగ్గిపోడానికి కూడా కారణమౌతుంది. పరీక్షలు రాసేటప్పుడు గందరగోళం , మతిమరుపు ఏర్పడుతుంటాయి. ఇవన్నీ కలిసి ఆందోళన, భయం, ఒత్తిడి, పెరిగి విద్యార్థి మనసులో ఆవేదన పెంచుతాయి. అందువల్ల పరీక్షల సమయంలో విద్యార్థికి చక్కని ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News