Monday, April 29, 2024

7 శాతానికి చేరుకున్న వినియోగదారుల ధరల సూచీ

- Advertisement -
- Advertisement -

 

Retail Inflation spike

న్యూఢిల్లీ: వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ఆగస్టులో 7.00 శాతానికి పెరిగింది, ఇది జూలైలో 6.71 శాతంగా ఉంది. కాగా పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి)  భారతదేశ ఫ్యాక్టరీ ఉత్పత్తి జూలైలో 2.4 శాతం వృద్ధిని సాధించిందని సూచించింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన రెండు వేర్వేరు డేటా ద్వారా ఈ విషయాలను సోమవారం వెల్లడించింది. గత నెలలో 7.00 శాతం పెరుగుదలతో, సిపిఐ వరుసగా ఎనిమిదో నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ఎగువ మార్జిన్ 6 శాతం కంటే పైన కొనసాగింది. మార్చి 2026తో ముగిసే ఐదేళ్ల కాలానికి ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కొనసాగించాలని ప్రభుత్వం,  సెంట్రల్ బ్యాంక్‌ని ఆదేశించింది. వినియోగదారుల ఆహార ధరల సూచిక (సిఎఫ్ పిఐ) లేదా ఆహారపదార్థాల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో నెలవారీగా 7.62 శాతానికి పెరిగింది. ఇది జూలైలో 6.69 శాతంగా ఉండిందని డేటా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News