Monday, April 29, 2024

ఎన్‌టిపిసికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. విభజన చట్ట ప్రకారం తెలంగాణలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందని, గత ప్రభుత్వం నిర్ణయాలతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, ఎన్‌టిపిసికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. కంటోన్మెంట్ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయడంతో మోడీకి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. దేశం ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేరడంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని, మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని రేవంత్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News