Monday, April 29, 2024

90 కోట్ల వ్యూస్ తో ‘రౌడీ బేబి’ సరికొత్త రికార్డు..

- Advertisement -
- Advertisement -

Rowdy Baby video song gets 90 cr views

‘రౌడీ బేబి’ సాంగ్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. 2018లో విడులైన ‘మారి 2’ చిత్రంలో ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘రౌడీ బేబి’ పాటలో ధనుష్, యంగ్ బ్యూటీ సాయిపల్లవిల అందమైన స్టెప్స్ కు అభిమానులే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడు ఫిదా అయ్యారు. ఈ సాంగ్ వీడియో ప్రేక్షకులని ఎంత‌గానో ఆకట్టుకుంది. దీంతో యూట్యూబ్ లో ఈ సాంగ్ అన్ని రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. తాజాగా ఈ సాంగ్ మరో రికార్డు సాధించింది. ఇప్పటివరకు యూట్యూబ్ లో ‘రౌడీ బేబి’ సాంగ్ 90 కోట్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. త్వరలోనే ఈ పాట 100 కోట్ల వ్యూస్ సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటకి ప్రభుదేవా కోరియోగ్రఫీ చేశారు.

Rowdy Baby video song gets 90 cr views

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News