Monday, April 29, 2024

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు లక్ష్యం 160

- Advertisement -
- Advertisement -

Royal Challengers Bangalore target 160

 

స్కోర్ : ఐపిఎల్‌‌ 2021 సీజన్‌ లో బాగంగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరుగుతోన్న తొలి సమరంలో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెన‌ర్‌, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (19) ర‌నౌటైనా.. మ‌రో ఓపెన‌ర్ క్రిస్ లిన్‌, సూర్య‌కుమార్ యాద‌వ్ చెల‌రేగి ఆడారు. ముఖ్యంగా లిన్ సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు(49). 23 బంతుల్లో 31 ప‌రుగులు చేసిన త‌ర్వాత సూర్య‌కుమార్ యాద‌వ్ అవుట‌య్యాడు. జేమీస‌న్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ డివిలియ‌ర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక యువ బ్యాట్స్‌మ‌న్ ఇషాన్ కిష‌న్ (19 బంతుల్లో 28), సూర్య‌కుమార్ యాద‌వ్ (23 బంతుల్లో 31) ప‌ర్వాలేద‌నిపించారు. హార్డ్ హిట్ట‌ర్ హార్దిక్ పాండ్యా (10) విఫ‌ల‌మ‌య్యాడు. చివ‌ర్లో చెల‌రేగుతార‌నుకున్న పొలార్డ్‌, కృనాల్ పాండ్యా.. ఆర్సీబీ క‌ట్టుదిట్ట‌మైన బంతుల ముందు త‌ల‌వంచారు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ 4 ఓవ‌ర్ల‌లో 27 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News