Monday, April 29, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్’ గ్లిమ్స్ అదుర్స్..

- Advertisement -
- Advertisement -

'RRR' Movie Glimpse released

హైదరాబాద్: రామ్‌చరణ్, తారక్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1న ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ఓ గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిపింది. ఇందులో భాగంగా కొద్దసేపటి క్రితం చిత్రయూనిట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి టీజర్ గ్లిమ్స్ అభిమానులతో పంచుకుంది. 45 సెకన్ల నిడివితో విడుదల చేసిన ఈ గ్లిమ్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో కొమురంభీమ్ పాత్రలో తారక్.. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనున్నారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డిడివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో అలియాభట్, ఒలీవియా మోరీస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

‘RRR’ Movie Glimpse released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News