Monday, April 29, 2024

అటవీ, పర్యావరణ, దేవాలయాల అభివృద్దికి భారీగా నిధులు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, వాస్తవిక దృక్పథం-నిర్మాణాత్మకమైన ఆలోచనల మేలుకలయికగా బడ్జట్ రూపకల్పన జరిగిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య, విద్యుత్ మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని తెలిపారు. పేద ప్రజల, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి, స్థానిక సంస్థలైన పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ భారీ మొత్తంలో నిధులను కేటాయించారని పేర్కొన్నారు. కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ పాలన ప్రజలు మెచ్చేదిగా ఉందని, ఏ ప్రభుత్వం తీసుకోనంతగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

మన రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అవకాశాలు మెండుగా ఉండే వ్యవసాయం రంగం అభివృద్ధికి శ్రద్ధ చూపుతూ ప్రపంచానికి పటెడ్డన్నంపెట్టే రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నదే సిఎం కెసిఆర్ అభిమతమని చెప్పారు. దానికి అనుగుణంగా రైతు సంక్షేమం, వ్యవసాయం రంగానికి కేటాయింపులు జరిపారన్నారు.తాను నిర్వహిస్తున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు అసెంబ్లీలో సిఎంను కలిసి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖకు బడ్జెట్‌లో రూ.791 కోట్లు , దేవాలయాల అభివృద్దికి రూ.500 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే అర్చకులు, ఆలయ ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేవాలయాల్లో ధూప దీప దీప నైవేద్యాలు, వాటి నిర్వహణ కోసం ఈ బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించడం ఆనందం వ్యక్తం చేశారు.

Rs.500 Cr Allocated for Temple’s Development in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News