Monday, April 29, 2024

రైతుబీమాకు ఐదేళ్లు ..రూ.5,402 కోట్లు సాయం

- Advertisement -
- Advertisement -
మంత్రి హరీశ్ రావు ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతు సంక్షేమం కోసం కేసిఆర్ సర్కారు అమలు చేస్తున్న పథకాల్లో రైతుబీమా పథకం ఈ రంగానికి చెందిన కుటుంబాలకు పెద్ద అండగా నిలిచింది. ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ 2018 ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం మంగళవారం నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ ద్వారా ఈ పధకం ద్వారా నిధులు చెల్లింపులను వివరించారు. అర్హులైన రైతులందరి తరపున ప్రభుత్వమే జీవిత బీమా సంస్థకు (ఎల్‌ఐసి) ప్రీమియం చెల్లిస్తూ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తున్నది.

పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగింది. 2018 లో రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే, ఈ ఏడాది ఈ పధకానికి రూ. 1477 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నట్టు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇప్పటి వరకు రైతుల తరుపున ప్రభుత్వం రూ. 6861 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించగా, వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందించింది. గుంట భూమి ఉన్నా చాలు, రైతుగా గుర్తించి, ఆ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించే అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదు. రైతుల గురించే కాదు, రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు కెసిఆర్ అంటూ మంత్రి హరీష్‌రావు ఈ మేరకు ట్వట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News