Monday, April 29, 2024

పల్లెప్రగతి ఇక పరుగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమావేశమయ్యారు. ఇదే అంశంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి శాంతికుమారితో ఇరువురు మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలలో వివిధ పనులకు సంబంధించి నిధు ల విడుదలపై చర్చించారు.

రూ.1190 కోట్లను విడుదల చే యాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టిన పనులకు నిధులను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులు విడుదల కావడంతో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరగనున్నాయి.
రాష్ట్ర సర్పంచుల సం ఘం ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుని మంత్రుల నివాసంలో కలిసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిధుల విడుదలతో సర్పంచ్‌లలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పా రు. సిఎం కెసిఆర్ తోపాటు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీశ్ రావులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News