Sunday, April 28, 2024

పోయి రావమ్మా గౌరమ్మ

- Advertisement -
- Advertisement -

Saddula Bathukamma was performed by Women with Devotion

 

ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు, తల్లులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకొంటున్నందుకు ఆనందంగా ఉంది.
     ట్విట్టర్‌లో ఎంఎల్‌సి కవిత

వాడవాడలా ఘనంగా సద్దుల బతుకమ్మ n కొవిడ్ నేపథ్యంలో
నిరాడంబరంగా వేడుకలు n రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఆడిన
గవర్నర్ తమిళిసై n రాయపర్తి వేడుకల్లో మహిళలతో కలిసి
పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి n దేశదేశాల్లో పూజలు అందుకున్న
గౌరమ్మ n భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికిన ఆడపడుచులు

మనతెలంగాణ/హైదరాబాద్ : వాడవాడలా సద్దుల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రాష్ట్రంతో పాటు చాలాదేశాల్లో ఎన్‌ఆర్‌ఐ మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ, మాస్కులు ధరించి ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఎంగిలిపువ్వు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు మహిళలు భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కోటికిపైగా బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఆ చీరలను ధరించి వారు బతుకమ్మలను ఆడారు. పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకలను నిర్వహించగా, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కుటుంబసభ్యులు ఇంటికే పరిమితమై హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈ వేడుకలను జరుపుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పండుగలపై నిర్లక్ష్యం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ పండుగలను, సంస్కృతీ, సంప్రదాయలను నిర్లక్ష్యం చేశారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సద్దుల బతుకమ్మ సంబరాల్లో భాగంగా గౌరీ పూజను మంత్రి ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ దసరా పండుగను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ తెలంగాణ పండుగ, సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.

రాష్ట్రం సిఎం కెసిఆర్ నేతృత్వంలో స్వయం సమృద్ధి సాధించి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించడంతో పాటు మహిళలను గౌరవించడానికి బతుకమ్మ చీరలను గౌరవ కానుకగా అందిస్తున్నామన్నారు. బతుకమ్మ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించి బతుకమ్మ పండుగకు ఖ్యాతిని తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రం గా ఆవిర్భావించాలని అమ్మవారిని వేడుకున్నట్టు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస రాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పలువురు మహిళలు పాల్గొన్నారు.

బతుకమ్మను ఎత్తుకున్న మంత్రి ఎర్రబెల్లి

రాయపర్తి మండలం ఘటికల్ లో మహిళలతో కలిసి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ ఆడడంతో పాటు బతుకమ్మను ఎత్తుకున్నారు. మంత్రి బతుకమ్మను ఆడడంతో మహిళలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూజిలాండ్‌లో బంగారు బతుకమ్మ సంబురాలు

తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ బంగారు బతుకమ్మ సంబురాలు ఆక్లాండ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు. న్యూజిలాండ్ దేశంలో కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశిష్ట అతిథులుగా ఎంపి ప్రియాంకా రాధాకృష్ణన్, ఇండియన్ హై కమిషన్ హానోరారి కాన్సల్ శ్రీ భావ్ దిల్లోన్, ఇండియన్ న్యూస్‌లింక్ ఎడిటర్ వెంకట్రామన్, పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి జెస్సికా ఫూఅంగ్, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు,అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పంపిన జాగృతి న్యూజిలాండ్ బంగారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షురాలు జ్యోత్గి ముద్దం, ప్రధాన కార్యదర్శి ప్రసన్న గుముడవెల్లి, సరిత, సంధ్య గౌడ్, విక్రమ్ కటుకం, సుకృతి పడాల, శ్రీహరి ప్రసాద్, నిహారిక నోరి, లావణ్య కోమల్, అంజలి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News