Sunday, April 28, 2024

హాలీవుడ్‌లోకి ప్రవేశించబోతున్న సమంత

- Advertisement -
- Advertisement -

Samantha

హైదరాబాద్: నాగచైతన్యతో వైవాహిక సంబంధం తెగిపోయాక సమంత తన కెరీర్‌లో ఏ మాత్రం తగ్గకుండా స్పీడ్ చూయిస్తూనే ఉంది. ఇటీవల ‘శాకుంతలం’ సినిమా చేసింది. ఓ తెలుగు థ్రిల్లర్ మూవీకి సైన్ చేసింది. తమిళ సినిమాలో నటిస్తోంది. అంతేకాక ‘పుష్ప’ అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కు డ్యాన్స్ చేయబోతుంది. ఇవన్నీ ఒక ఎతైతే, మరోటి హాలీవుడ్‌లో ప్రవేశించనుండడం. సమంతతో ‘ఓ బేబీ’ సినిమా నిర్మించిన సునీత తాటి తీయబోయే ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ ద్వారా ఆమె హాలీవుడ్‌లో కాలిడబోతోంది. తిమెరి ఎన్ మురారి ఈ నవల రాశారు. ఈ సినిమా కొంత భాగాన్ని మన దేశంలోనూ, మరికొంత భాగాన్ని వేల్స్‌లోనూ షూట్ చేయనున్నట్లు వినికిడి. ఈ సినిమాకి హాలీవుడ్ డైరెక్టర్ ‘ఫిలిప్ జాన్’ దర్శకత్వం వహించబోతున్నారట. అయితే ఇంత వరకు ఈ సినిమాలో హీరో ఎవరుంటారన్నది తెలియలేదు. సమంత ఇప్పటికే హాలీవుడ్ మూవీ ‘ఎటెర్నల్స్’ను ప్రమోట్ చేసింది. ఆ సినిమా నిడివి 2గంటల 36 నిమిషాలు. సమంత హాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన మరిన్ని విశేషాల కోసం వేచి చూద్దాం.

novel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News