Monday, April 29, 2024

ఢిల్లీలో కాలుష్యం తగ్గినా.. కేసు మూసివేయం: సుప్రీం

- Advertisement -
- Advertisement -

SC hearing PIL on Delhi Air Pollution

న్యూఢిల్లీ: ఢిల్లీ వాయు కాలుష్యంపై బుదవారం సుప్రీం కోర్టులో మరోసారి విచారణ కొనసాగింది. ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోవడంతో గత మూడు వారాలుగా ప్రజలు కాలుష్య కోరల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రం పరిగణించిన కోర్టు ‘ఒకవేళ కాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఈ కేసు మూసివేయబోం’ అంటూ స్పష్టం చేసింది. ఇది దేశ రాజధాని. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితితో ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయో చూడండి. ఈ మూడు రోజులూ తగిన చర్యలు తీసుకోండి. ఈలోగా పరిస్థితి మెరుగుపడితే, కొన్ని నిషేధాజ్ఞలు ఎత్తి వేయండి. ఒకవేళ కాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ కేసులో విచారణ కొనసాగిస్తాం. తగిన ఆదేశాలు జారీ చేస్తాం. అంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం స్పష్టం చేసింది. గణాంకాల ఆధారంగా పరిస్థితిని అంచనా వేసి, కాలుష్య పరిస్థితి తీవ్రంగా మారకముందే చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. దేశ రాజధానిలో గాలి నాణ్యతకు సంబంధించి ఆమోదయోగ్యమైన స్థాయిల్ని నిర్వచించాలి. సూపర్ కంప్యూటర్లు ద్వారా గణాంకాలకు సంబంధించి ఒక విధానం రూపొందించాల్సి ఉంది అని సూచించింది. అలాగే ఈ వాయు కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి అందులో వివరించింది. మరోపక్క దీనిపై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.

SC hearing PIL on Delhi Air Pollution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News