Sunday, April 28, 2024

బంగ్లాదేశ్‌పై స్కాట్లాండ్ సంచలన విజయం

- Advertisement -
- Advertisement -

అల్ అమీరట్: టి20 వరల్డ్ కప్ తొలి రోజునే సంచలనం నమోదైంది. బలమైన బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో స్కాట్టాండ్ చివరికి పై చేయి సాధించింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 141 పరుగుల లక్షాన్ని ఛేదించడంలో విఫలమైన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే పరికి 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు బంగ్లాదేశ్ కీలక బ్యాట్స్‌మెన్ షకీబ్, ముష్ఫికర్ వికెట్లు పడగొట్టిన స్కాట్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ గ్రీవ్‌స ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్క్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్‌వీల్ 24 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ జట్టులో ముష్ఫికర్ రెహమాన్ మాత్రమే 38 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలిచాడు. షకీబ్ 20 పరుగులు, ముహమ్మదుల్లా 23 పరుగులు చేశారు.
రాణించిన బంగ్లా బౌలర్లు
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ బంగ్లాదేశ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీ హసన్ 3 వికెట్లతో స్కాట్లాండ్ పతనాన్ని శాసించగా, షకీబ్, ముస్తాఫిజుర్ చెరో రెండు వికెట్లు తస్కిన్ అహ్మద్, మహ్మద్ సైఫుద్దీన్ తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో మున్సే (29), క్రాస్ (11), క్రిస్ గ్రీవ్స్(45), మార్క్ వాట్(22) కొంత మేరకు రాణించినా పెద్దగా స్కోరు చేయలేకపోయారు. బంగ్లా బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్‌స 8వ ఓవర్‌లో తొలుత మెహిదీ హసన్ మాథ్యూ క్రాస్, మున్సే వికెట్లను పడగొట్టి దెబ్బ తీయగా, 11వ ఓవర్ షకీబ్ అల్ హసన్.. బెరింగ్టన్, లీస్‌ను పెవిలియన్‌కు పంపడంతో స్కాట్లాండ్11 ఓవర్లలో 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకు పోయింది. అయితే ఈ దశలో క్రిస్ గ్రీవ్స్ జట్టును ఆదుకున్నాడు. దీంతో ఆ జట్టు ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది.

Scotland beat Bangladesh with 6 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News