Monday, April 29, 2024

జగ్గు తండాలో ఘనంగా సీత్లా పండుగ వేడుకలు

- Advertisement -
- Advertisement -

గుండాల :ప్రతీ ఏడాది ఆనవాయితీగా, సాంప్రదాయ బద్దంగా ఆషాడమాసంలో జరుపుకునే పండుగను మంగళవారం గిరిజనం నిర్వహించారు. దేవతలు కరుణించాలని, విరివిగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో గ్రామాలు చల్లగా ఉండాలని కుల దేవతలను వేడుకుంటూ గిరిజనులు సీత్ల పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల పరిధిలోని జగ్గుతండాలో మహిళలు ప్రత్యేక పూజలు, వంటకాలు తయారు చేసి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామ పొలిమేరలో ఉన్న దేవతలకు నైవేద్యం సమర్పించారు.

పోతురాజు దేవుడు వద్ద మేకలు, కోళ్లను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. వంటకాలను పశువులపై చల్లి ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని, స్థానికులు అనారోగ్య బారిన పడకుండా కాపాడమని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జర్పుల కిషన్ నాయక్, మాలోత్ శ్రీనివాస్ నాయక్, ఇస్లావత్ రాందాస్ నాయక్, చాంప్లా నాయక్, బోడా లక్‌పతి నాయక్, గుగులోత్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News