Monday, April 29, 2024

రెండు రోజుల నష్టాలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

Sensex

 

232 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ముంబై: రెండు రోజుల స్టాక్‌మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. మూడో రోజు తీవ్ర హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232.24 పాయింట్లు (0.74 శాతం) పెరిగి 31685.75 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 65.30 పాయింట్లు (0.71 శాతం) లాభంతో 9,270 వద్ద స్థిరపడింది. రూపాయి తొమ్మిది పైసలు కోల్పోయి డాలర్‌పై 75.72 వద్ద ముగిసింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలోపేతం కావడం, అమెరికాచైనా మధ్య మరో వాణిజ్య యుద్ధం జరిగే అవకాశం వంటి పరిణామాలతో రూపాయి బలపడింది.

ప్రధానంగా బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, గెయిల్, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్, జీ లిమిటెడ్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాలతో ముగిశాయి. మరోవైపు ఇన్‌ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఐటిసి, యుపిఎల్, ఐఒసి, హిందుస్తాన్ యూనిలీవర్, బిపిసిఎల్, టిసిఎస్, ఇన్ఫోసిస్, సిప్లా షేర్లు నష్టాలను చవిచూశాయి. రంగాల వారీగా ఎఫ్‌ఎంసిజి, పిఎస్‌యు బ్యాంక్ మినహా అన్ని రంగాలు లాభపడ్డ్డాయి. వీటిలో ఆటో, బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, మీడియా, ఫార్మా, రియాల్టీ, మెటల్, ఐటి ఉన్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 31,355 స్థాయిలో 0.31 శాతం క్షీణతతో ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.33 తర్వాత 55.35 పాయింట్లు పెరిగి 31508.86 వద్ద ఉంది. ఆ తర్వాత లాభాలను పెంచుకుంది.

Sensex rises 232 points in snaps 2 day
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News