Monday, April 29, 2024

ప్రతి వెయ్యి మందిలో ఏడుగురికి హెచ్‌ఐవి

- Advertisement -
- Advertisement -

HIV

 

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి 1000 మందిలో 7 గురు హెచ్‌ఐవితో జీవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ
ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జి. అన్న ప్రసన్న కుమారి తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించి హెచ్‌ఐవి వ్యాప్తిని నివారించుటకుగాను ఎయిడ్స్‌పై ప్రజలలో అవగాహన కల్పించుటకు సమాచారాన్ని ప్రదర్శన ఆటోరిక్షాలను కార్యాలయ ప్రాంగణంలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా 1395 ఆటోరిక్షాలపై మార్చి 25వ తేదీ వరకు ప్రదర్శిస్తారన్నారు.

రాష్ట్ర ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎవరైతే తమ జీవిత భాగస్వామితో కాకుండా ఇతరులతో లైంగిక సంబంధం ఉన్నవారు హెచ్‌ఐవితో కలుషితమైన సిరంజిలు, ఇతర ఇంజక్షన్ పరికరాలు ఒకరితో మరొకరు మార్చుకుంటున్న వారు, ఎప్పుడైనా సురక్షితం కానీ రక్త మార్పిడి జరిగినట్లు అయితే మీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఒకవేళ హెచ్‌ఐవి ఉన్నట్లయితే వెంటనే ఎఆర్‌టి చికిత్స ప్రారంభించి క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఆరోగ్యంగా జీవితం కొనసాగించాలని కోరారు.

Seven out of every thousand people have HIV
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News