Monday, April 29, 2024

జర్మనీలో రతికార్మికుల కష్టాలు!

- Advertisement -
- Advertisement -

రతి కార్మికులు బాగా సంపాదిస్తారని, ఇష్టాపూర్వకంగానే వేశ్యా వృత్తిలో కొనసాగుతున్నారని చాలామంది అనుకుంటారు. (మన దేశంలోనైతే ఒళ్ళు కొవ్వెక్కి వ్యభిచారం చేస్తున్నారంటారు.) ఇది అతి కొద్దిమందికే వర్తిస్తుంది. అత్యధికులు పేదరికం వల్ల ఈ వృత్తికి నెట్టబడ్డారు. బతకడానికి అతి తక్కువ సొమ్ముకు శరీరాలను అమ్ముకుంటున్నారు. రెడ్‌లైట్ జిల్లాల నేపథ్యం, నిర్మాణం, యంత్రాంగాల గురించి అతికొద్దిమందికి తెలుసు. చాలా మంది పురుష పాశవిక నైజాల నిజాలను పట్టించుకోరు. జర్మనీలో వ్యభిచారం చట్టబద్ధం చేయబడింది. అయినా స్త్రీల రతి కార్మికతపై చర్చ జర్మనీలో కూడా నిషిద్ధమే. వ్యభిచారం, రతిక్రీడల వ్యాపారం, అంగళ్లు, క్లబ్బులు, పెద్దల నాట్య, నాటక శాలలు కేంద్రీకృతమై ఉన్న పట్టణ ప్రాంతాలను రెడ్‌లైట్ జిల్లాలు, ఆనంద ప్రదేశాలు అంటారు. పూర్వం రైలు మార్గ నిర్మాణ నిర్వహణ కార్మికులు తమ ఎర్ర లాంతర్లను బయట తగిలించి వేశ్యాగృహాలలో ప్రవేశించేవారట.

 Sex workers problems in Germany

వ్యభిచార వృత్తిలోని స్త్రీలు తాము వైద్యులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కనీసం వృద్ధుల శ్రేయో కార్మికులు కావాలని చిన్నతనంలో కోరుకున్నవారే. ఇప్పుడు గతి తప్పి రతి కార్మికులు (Sex Workers) గా బతుకుతున్నారు. 2000 ఏళ్ల పశ్చిమ జర్మనీ నగరం కొలగ్నె లోని ‘పాశ్చ’, ప్రపంచంలో అతిపెద్ద వేశ్యాగృహం. 120 మంది వేశ్యలున్న ఈ గృహానికి రోజుకు 1000 మంది విటులు వస్తారు. వ్యభిచారం అనైతికం అన్న అంశాన్ని 2002లో జర్మనీ నిషేధించింది. 20 ఏళ్లు దాటినా రతి కార్మికుల సామాజిక, న్యాయ స్థితుల్లో ప్రగతి లేదు. వారిపై శారీరక, ఆర్థిక దోపిడీ, నేరారోపణలు పెరుగుతూనే ఉన్నాయి. కళంక ఆరోపణలు తగ్గలేదు. రతి కార్మికులు చీకటి, బహిర్గత రూపాలలో రెండు జీవితాలు గడుపుతున్నారు. వీరి స్థితిగతులను మెరుగుపర్చడానికి, ‘వ్యభిచారిణుల రక్షణ చట్టం 2017’ చేశారు. ఇది వ్యభిచార బాధిత స్త్రీలకు కాక పోలీసులకు అనుకూలంగా ఉందేమో! ఈ చట్టం కళంకితమైంది. వివక్షాపూరితమైంది. ప్రమాదాలను పెంచింది అని రతి కార్మికులు అన్నారు.

రతి కార్మికులు బాగా సంపాదిస్తారని, ఇష్టాపూర్వకంగానే వేశ్యా వృత్తిలో కొనసాగుతున్నారని చాలామంది అనుకుంటారు. (మన దేశంలోనైతే ఒళ్ళు కొవ్వెక్కి వ్యభిచారం చేస్తున్నారంటారు.) ఇది అతి కొద్దిమందికే వర్తిస్తుంది. అత్యధికులు పేదరికం వల్ల ఈ వృత్తికి నెట్టబడ్డారు. బతకడానికి అతి తక్కువ సొమ్ముకు శరీరాలను అమ్ముకుంటున్నారు. రెడ్‌లైట్ జిల్లాల నేపథ్యం, నిర్మాణం, యంత్రాంగాల గురించి అతికొద్దిమందికి తెలుసు. చాలా మంది పురుష పాశవిక నైజాల నిజాలను పట్టించుకోరు. జర్మనీలో వ్యభిచారం చట్టబద్ధం చేయబడింది. అయినా స్త్రీల రతి కార్మికతపై చర్చ జర్మనీలో కూడా నిషిద్ధమే. వ్యభిచారం, రతిక్రీడల వ్యాపారం, అంగళ్లు, క్లబ్బులు, పెద్దల నాట్య, నాటక శాలలు కేంద్రీకృతమై ఉన్న పట్టణ ప్రాంతాలను రెడ్‌లైట్ జిల్లాలు, ఆనంద ప్రదేశాలు అంటారు. పూర్వం రైలు మార్గ నిర్మాణ నిర్వహణ కార్మికులు తమ ఎర్ర లాంతర్లను బయట తగిలించి వేశ్యాగృహాలలో ప్రవేశించేవారట. అత్యవసర పరిస్థితి ఎదురైతే తమ సిబ్బంది తమను సులభంగా గుర్తించటానికి ఇలా చేసేవారట. అందు కే వేశ్యాగృహ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందట. ఈ జానపద శబ్దలక్షణ శాస్త్ర కథనం నిరాధారమని అమెరికన్ జానపద రచయిత బార్బర మికెల్సన్ అన్నారు.

జూలియా వేగె మహిళా రతి కార్మికుల న్యాయసలహా కేంద్రం ‘అమాలీ మాన్హీం’ వ్యవస్థాపకురాలు. దాని సలహా బోర్డు సభ్యురాలు. ఫోటోగ్రాఫర్ హిప్ యెర్లికయ 2019- 2021 మధ్య అనేక వేశ్యాగృహాలు తిరిగి 1800 ఫోటోలు తీశారు. జీవితమంతా అణగదొక్కబడ్డ స్త్రీల ఉన్నతికి పని చేశారు. యాసిడ్ దాడుల బారినపడి బతికినవారి కోసం యెర్లికయ అసోసియేషన్ ను స్థాపించారు. బంగ్లాదేశ్‌లో యాసిడ్ దాడుల బాధిత మహిళల ఘటనల ఫోటోలు తీశారు. ఫోటోలలో స్త్రీలను బహిర్గతం చేయకుండా వ్యభిచార వృత్తిలో ప్రభుత్వాలు, పురుషాధిక్య సమాజం పోషిస్తున్న ప్రమాదకర పరిస్థితులను బయటపెట్టారు. స్త్రీల బాధామయ గాథలను చిత్రాలలో వివరించారు. ఎక్కడ ఏ స్థితిలో తమ ఫోటో తీసుకోవాలో నిర్ణయించే సృజనాత్మక నియంత్రణ స్త్రీలకు ఉంది.
జూలియా వేగె, ఫోటోగ్రాఫర్ హిప్ యెర్లికయ లు కలిసి నైరుతి జర్మనీ నగరం మాన్హీంలోని రీస్ ఎంగెల్ హార్న్ ప్రదర్శనశాలల సహకారంతో ‘వ్యభిచారంలో ముఖరహిత మహిళలు’ అన్న శీర్షికతో అపూర్వమైన ఫోటో ప్రదర్శన నిర్వహించారు. అందులో వేశ్యల దయనీయ స్థితిగతులను తెలిపే హిప్ యెర్లికయ ఫోటోలను, పడుపు వృత్తిపై పలువురు ప్రముఖుల వ్యాఖ్యానాలను, ఇంటర్వ్యూల ఆడియోలను ప్రదర్శించారు. మాస్కుల ఫోటోలతో పడుపు వృత్తి స్త్రీల ద్విముఖ జీవితాలను అర్థవంతంగా వర్ణించారు. వ్యభిచార వృత్తిలోని లైంగిక, సామాజిక, నైతిక సమస్యలను ఈ ఫోటోలు, వ్యాఖ్యానాలు విభిన్న దృష్టి కోణంలో అద్వితీయంగా కళ్ళకు కట్టాయి. మహిళా రతి కార్మికుల చీకటి బతుకులను, నిత్య జీవిత నిజాలను వెలుగులోకి తీసుకురావడమే ఈ ప్రదర్శన ఉద్దేశం. రతి కార్మిక స్త్రీలు తమ హావభావాలు, బాధలు కనిపించకుండా తెల్లటి మాస్కులు ధరిస్తారు. ఈ ముఖ ముసుగు వారి వాస్తవ గుర్తింపులను, జీవిత నిజాలను దాస్తుంది. సమాజానికి దూరం గా నివస్తున్న వారి జీవన విధానాలను మరుగు పరుస్తుంది. వారిని ముఖరహితులను చేస్తుంది. భరించరాని కష్టాల జీవిత పరిస్థితులు, ఆర్థిక అవసరాలు, సరైన జీవన దృక్కోణం అలవడకపోవడం, చదువుకునే అవకాశం లేకపోవడం, మధ్యలో చదువు మానవలసి రావడం సర్వసాధారణంగా స్త్రీలను పడుపు వృత్తిలోకి తోస్తాయి.

ఇలాంటి విషయాలపై ఈ ఫోటో ప్రదర్శన అవగాహన కల్పించింది. సానుభూతి, తాదాత్మ్యతలను కలిగించింది. ఈ మహిళలు గౌరవ మర్యాదలకు, ప్రశంసలకు అర్హులని వివరించింది. వీరి గౌరవ మర్యాదల హక్కు అనుల్లంఘనీయమని నిర్ధారించింది. కొందరు స్త్రీలు, తప్పుడు వాగ్దానాలు, ఆశల ఎరకు చిక్కుతారు. ఒత్తిడికి గురవుతారు. కొందరు మోసపూరితంగా, బలవంతంగా ఈ కూపంలో దింపబడతారు. కొందరి జీవితాలను తార్పుడుగాళ్లు, దళారీ స్త్రీలు పాడు చేస్తారు. ఈ వంచిత మహిళలు తమ భావాలను, కోరికలను, ఆశలను, కలలను ప్రపంచానికి తెలియపరిచే అవకాశాలను ఈ ఫోటో ప్రదర్శన కల్పించింది. ఇక్కడ నిర్వహించబడిన అనేక ఇంటర్వ్యూలలో, స్త్రీలు, తమ చీకటి జీవితాల కఠోర అనుభవాలను చెప్పారు.

ఈ ప్రదర్శన ప్రక్రియ మహిళా రతి కార్మికుల పట్ల చాలా మంది మగవారి అభిప్రాయాలను మార్చి వేసింది. భారీ సంఖ్యలో, స్త్రీలు, వీరి పునరావసంలో సహాయ సహకారాలు అందించారు. ఈ ప్రదర్శనను వేల సంఖ్యలో సందర్శించారు. వ్యభిచార వృత్తికి సంబంధించిన తప్పుడు ప్రచారాలు, అవగాహనలు, ఆలోచనలు, మూఢాచారాల గురించి తెలుసుకున్నారు. ప్రచారం చేస్తున్నారు. 2021 నవంబర్ 14 న మొదలైన ఈ ప్రదర్శన 2022 ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. ప్రవేశం ఉచితం. ప్రపంచమంతా వ్యభిచార అవగాహన ప్రదర్శనలు జరగాలి. పురుషుల ఆలోచన ధోరణి మారాలి. మహిళలు కూడా మానవులేనన్న నిజాన్ని గుర్తించాలి. స్త్రీలకు సమాన అవకాశాలను కల్పించాలి.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News