Sunday, April 28, 2024

12 మంది యువ శాస్త్రవేత్తలకు శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం లోని అత్యున్నత బహుళ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలలో శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రముఖమైనది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి దీన్ని నెలకొల్పింది. దీని వ్యవస్థాపక డైరెక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ గౌరవార్థం ఈ బహుమతులను అందించడం పరిపాటిగా వస్తోంది. సెప్టెంబర్ 26న సంస్థాపక దినోత్సవం అయినప్పటికీ, ముందుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సిఎస్‌ఐఆర్) సోమవారం 2022 కు సంబంధించి 12 మంది యువ శాస్త్రవేత్తలకు శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులను ప్రకటించింది.

45 ఏళ్ల కన్నా తక్కువ వయసు శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ఏటా ఇస్తున్నారు. ప్రశంసాపత్రంతోపాటు జ్ఞాపిక , రూ. 5 లక్షల నగదు బహుమతి ఇస్తారు. నేషనల్ సైన్స్ అవార్డులను ప్రభుత్వం తగ్గించే యోచనలో ఉందన్న వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఈ అవార్డులు ప్రకటించడం విశేషం. అవార్డులకు ఎంపికైన వారిలో సిఎస్‌ఐఆర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయోలజీ (కోల్‌కతా) కి చెందిన ఇమ్మునోలాజిస్ట్ డిప్యమాన్ గంగూలీ, పూణే కేంద్రంగా గల ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ కనక్ సహా, బెంగళూరుకు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చి లోని ఇంటర్నేషనల్‌సెంటర్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ నుంచి కనిష్క బిశ్వాస్ ఉన్నారు.

కాన్పూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైక్రోబయోలజీ అండ్ సెల్‌బయోలజీ ఆఫ్‌కు చెందిన అమిత్ సింగ్‌కు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్‌స్, బయోఇంజినీరింగ్ ఆఫ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అరుణ్ కుమార్ శుక్లాకు అవార్డులు వచ్చాయి. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చి బయో ఆర్గనిక్ కెమిస్ట్రీ లేబొరేటరీకి చెందిన బిస్వాస్, టి. గోవిందరాజులకు కెమికల్ సైన్సెస్ కేటగిరిలో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు లభించింది. భూగోళం, వాతావరణం, సముద్రాలు, గ్రహాల శాస్త్రాల కేటగిరిలో జొర్హాట్ లోని సిఎస్‌ఐఆర్ నార్త్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన బినయ్ కుమార్ సైకియా ఎంపికయ్యారు.

ముంబై లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చికి చెందిన అనిష్ ఘోష్‌కు, చెన్నై లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్‌కు చెందిన సాకేత్ సౌరభ్‌కు మేథమెటికల్ సైన్సెస్ కేటగిరీలో అవార్డులు లభించాయి. మెడికల్ సైన్సెస్‌లో అచ్చుత మీనన్ సెంటర్ ఫర్ హెల్త్‌సైన్సెస్ స్టడీస్ ఆఫ్ శ్రీ చిత్రా తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్, అండ్ టెక్నాలజీకి చెందిన డాక్టర్ జీమోన్ పన్నియమ్మక్కల్ , బొంబాయి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోసైన్సెస్, బయో ఇంజినీరింగ్‌కు చెందిన రోహిత్ శ్రీ వాత్సవకు అవార్డులు వచ్చాయి. ఫిజికల్ సైన్సెస్ కేటగిరిలో సాహాకు అవార్డు రాగా,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News